LOADING...
Shimron Hetmyer: మ్యాచ్ చేజారినా రికార్డ్ మాత్రం విండీస్‌దే.. విండీస్ ప్లేయర్ అరుదైన ఘనత
మ్యాచ్ చేజారినా రికార్డ్ మాత్రం విండీస్‌దే.. విండీస్ ప్లేయర్ అరుదైన ఘనత

Shimron Hetmyer: మ్యాచ్ చేజారినా రికార్డ్ మాత్రం విండీస్‌దే.. విండీస్ ప్లేయర్ అరుదైన ఘనత

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2026
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌లో రికార్డులు సృష్టించడం, వాటిని మరొకరు అధిగమించడం సహజమే. టీమిండియా-వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 చివరి మ్యాచ్‌లో కరీబియన్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మెయర్ అరుదైన ఘనత సాధించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా, కేవలం రెండు సిక్సర్లతో ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. రోస్టన్ చేజ్, కెప్టెన్ షై హోప్ జట్టుకు మంచి ఆరంభం అందించారు. తొలి వికెట్ పడిన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన హెట్‌మేయర్ తన ఫామ్‌ను మరోసారి చాటాడు.

Details

వరల్డ్‌కప్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా రికార్డు

హర్దిక్ పాండ్యా బౌలింగ్‌లో తొలి సిక్స్ బాదిన అతడు, అనంతరం వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో మరో భారీ సిక్స్ కొట్టాడు. దీంతో ఒకే వరల్డ్‌కప్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో కేవలం 7 ఇన్నింగ్స్‌ల్లోనే అతడు 19 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు సాహిబ్జాదా ఫర్హాన్ (18 సిక్సర్లు) పేరిట ఉండేది. అతను 2024లో నికోలస్ పూరన్ నెలకొల్పిన 17 సిక్సర్ల రికార్డును అధిగమించాడు. ఇప్పుడు ఆ ఇద్దరి రికార్డులను దాటి హెట్‌మేయర్ అగ్రస్థానంలో నిలిచాడు.

Details

జస్పిత్ బుమ్రా బౌలింగ్‌లో ఔట్

అయితే ఈ మ్యాచ్‌లో అతడు ఎక్కువసేపు నిలవలేకపోయాడు. భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కేవలం 12 బంతుల్లో 27 పరుగులు (2 సిక్సర్లు, 1 ఫోర్) చేసి పెవిలియన్ చేరాడు. అదే ఓవర్‌లో రోస్టన్ చేజ్ (40)ను కూడా బుమ్రా ఔట్ చేయడంతో వెస్టిండీస్‌కు భారీ దెబ్బ తగిలింది. దీంతో మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించింది. చివరగా సంజూ శాంసన్ అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియాను సెమీఫైనల్‌కు చేర్చాడు.

Advertisement