లక్నో చేతిలో ఓడినా.. రాజస్థానే నంబర్ వన్..!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా 26వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలైంది.
స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో రాజస్థాన్ విఫలమైంది. లక్నోపై 10 పరుగుల తేడాతో ఓడినా పాయింట్ల పట్టికలో మాత్రం రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది.
లక్నో, రాజస్థాన్ చెరో 4 మ్యాచ్ లో గెలిచి 8 పాయింట్ల సాధించాయి. అయితే నెట్ రన్ రేట్ కారణంగా రాజస్థాన్ టాప్ ప్లేస్ లో ఉంది. లక్నో యథావిధిగా రెండో స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానంలో ఉంది.
ఇక లక్నో బౌలర్ మార్క్ వుడ్ అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ లీడ్ లో ఉన్నాడు.
details
అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా డుప్లెసిస్
ఇక ఈ సీజన్ లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ డుప్లెసిస్ 259 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తర్వాత లక్నోపై 40 పరుగులు చేసిన బట్లర్ 244 పరుగులతో రెండో స్థానానికి దూసుకెళ్లాడు.
కోల్ కతా స్టార్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ మూడో స్థానంలో నిలిచాడు. లక్నో బౌలర్ మార్క్ వుడ్ 4 మ్యాచ్ ల్లో 11 వికెట్లు తీసి ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.
యుజేంద్ర చాహల్ 6 మ్యాచ్ లో 11 వికెట్లతో రెండో స్థానానికి వచ్చాడు.