
IPL 2023: స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయిన రాజస్థాన్.. లక్నోదే గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో లక్నో బ్యాట్‌మెన్స్ తడబడ్డారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ కి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. దీంతో 10 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది.
లక్నో బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (39), మేయర్స్(51), పూరన్ (28) ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
రాజస్థాన్ బౌలర్లలో రవిచంద్రన్ రెండు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, హోల్డర్ తలా ఓ వికెట్ తీశారు.
details
చెలరేగిన లక్నో బౌలర్లు
155 పరుగుల లక్ష్యంతో బరిగిలోకి రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ను నిలకడగా ఆరంభించింది. యశస్వీ జైస్వాల్ (44) జోస్ బట్లర్ (40) పరుగులతో చెలరేగారు. కెప్టెన్ సంజుశాంసన్(2) అనవసర పరుగు కారణంగా రనౌట్ అయ్యాడు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న హిట్ మేయర్ భారీ షాట్ ప్రయత్నించి పెవిలియానికి చేరాడు. దీంతో రాజస్థాన్ గెలుపు ఆశలు సన్నగిల్లాయి. చివర్లో ఫడిక్కల్, పరాగ్ రాణించినా ఫలితం లేకుండా పోయింది. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా కేవలం 8 పరుగులు మాత్రమే వచ్చాయి.
లక్నో బౌలర్లలో స్టోయినిస్, అవేశ్ ఖాన్ రెండు వికెట్లు విజృంభించారు.