
యాషెస్ సమరానికి సర్వం సిద్ధం.. ఎక్కువ సిరీస్‌లు గెలిచిందే వీరే..?
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ లోకమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ముగిసింది. ఈ పోరులో టీమిండియాపై ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది.
ప్రస్తుతం మరో ప్రతిష్టాత్మక పోరు మొదలు కానుంది. యాషెస్ సిరీస్ సమరం రేపటి నుంచి ప్రారంభం కానుంది.
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఇప్పటికే ఈ యుద్ధానికి సై అంటున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచులు జరగనున్నాయి. అయితే ఈ రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరాటం హోరాహోరీగా సాగడం ఖాయం.
18నెలల నుంచి 30 నెలల గ్యాప్ లో ఈ సిరీస్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఇంగ్లండ్, మరోసారి ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తుంది. యాషెస్ సిరీస్ మొదటిసారిగా 1882 ప్రారంభమైంది. అందులో ఇంగ్లాండ్ 2-1 తో నెగ్గింది.
Details
యాషెస్ చరిత్రలో ఎక్కువ పరుగులు చేసిన డాన్ బ్రాడ్‌మన్
ఇప్పటి వరకూ క్రికెట్ చరిత్రలో మొత్తం 330 యాషెస్ టెస్టు మ్యాచులు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 134 టెస్టులు, ఇంగ్లండ్ 106 టెస్టులు గెలుపొందింది. ఇక మిగిలన 90 మ్యాచులు డ్రాగా ముగిశాయి.
అయితే 2019 వరకూ మొత్తం 71 యాషెస్ టెస్టు మ్యాచులు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 33, ఇంగ్లాండ్ 32 మ్యాచుల్లో నెగ్గింది. మరో ఆరు మ్యాచులు డ్రా అయ్యాయి.
యాషెస్‌సిరీస్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ జిమ్ లేకర్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీశాడు. ఆ మ్యాచ్ మొత్తంలో 19 వికెట్లను అతను తీశాడు.
ఇప్పటికి టెస్టు చరిత్రలో ఈ రికార్డు నిలిచిపోయింది. ముఖ్యంగా యాషెస్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డాన్ బ్రాడ్‌మన్ (5028)కు రికార్డు ఉంది.