టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25.. టీమిండియా షెడ్యూల్ ఖరారు!
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా రెండోసారి పరాజయం పాలైంది. మొదట న్యూజిలాండ్ చేతిలో ఖంగుతున్న భారత్, తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా సంచలన ఇన్నింగ్స్ తో టీమిండియాను ఓడించింది. దీంతో టీమిండియా మూడో టెస్టు ఛాంపియన్ షిప్ పై ఆశలను పెట్టుకుంది. 2023-25 మధ్య భారత్ 13 టెస్టు మ్యాచులను ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం భారత్ తొలి టెస్టు సిరీస్ వెస్టిండీస్ తో ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి అనంతరం టీమిండియా మొదట వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా జూలై 12న భారత్, వెస్టిండీస్ తో తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది.
వెస్టిండీస్ పర్యటన అనంతరం దక్షిణాఫ్రికా టూరుకు వెళ్లనున్న టీమిండియా
వెస్టిండీస్ తో పర్యటన ముగిసిన తర్వాత భారత్ దక్షిణాఫ్రికా టూరుకు వెళ్లనుంది. అక్కడ డిసెంబర్-జనవరి మధ్యలో రెండు టెస్టులు ఆడనుంది. తర్వాత 2024 జనవరి, ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో 5 టెస్టులు మ్యాచులు ఆడుతుంది. ఆ పర్యటన ముగిసిన వెంటనే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు భారత్ పర్యటనకు రానున్నాయి. టీమిండియా జట్టు ముందుగా బంగ్లాతో రెండు టెస్టు మ్యాచులు, తర్వాత న్యూజిలాండ్ తో మూడు టెస్టు మ్యాచులను ఆడనుంది. దీంతో టీమిండియా షెడ్యూల్ ప్రకారం 13 టెస్టు మ్యాచులను పూర్తి చేసుకుంటుంది.