జాతీయ క్రికెట్ అకాడమీకి చేరుకున్న కేఎల్ రాహుల్
టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎట్టకేలకు జాతీయ క్రికెట్ అకాడమీ కి చేరుకున్నాడు. కేఎల్ రాహుల్ గాయం నుంచి ఐపీఎల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇటీవల అతని తొడకు జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. దీంతో అతడు ఎన్‌సీఎలో ఉండి తిరిగి ఫిటె నెస్ సాధించడంపై దృష్టి పెట్టనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయపడటంతో ఈ మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ కు దూరమయ్యాడు. వన్డే ప్రపంచ కప్, ఆసియా కప్ కు అందుబాటులో ఉండటానికి కేఎల్ రాహుల్ ఇప్పటి నుంచే ఫిట్ నెస్ పై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఫిటెనెస్ పై దృష్టి సారించనున్న కేఎల్ రాహుల్
కేఎల్ రాహుల్ ఆసియా కప్ లో సత్తా చాటి వరల్డ్ కప్‌లో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నాడు. ఐపీఎల్ మధ్యలోనే కేఎల్ రాహుల్ తొడ గాయం కారణంగా తప్పుకోవడంతో అతని స్థానంలో లక్నో జట్టుకు కృనాల్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించాడు. ఐపీఎల్ లో ఆడిన కొన్ని మ్యాచుల్లో కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. అయితే సెప్టెంబర్ లో జరిగే ఆసియా కప్‌లో రీ ఎంట్రీ ఇవ్వాలని కేఎల్ రాహుల్ భావిస్తున్నాడు. ఈ మేరకు ఫిట్ నెస్ దృష్టి సారించి మునపటి ఫామ్ ను అందుకోవాలని కేఎల్ రాహుల్ తహతహలాడుతున్నాడు.