Page Loader
రోహిత్ శర్మను వెంటాడుతున్న బ్యాడ్‌ లక్.. కెప్టెన్సీ ఉండేనా.. ఊడేనా..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

రోహిత్ శర్మను వెంటాడుతున్న బ్యాడ్‌ లక్.. కెప్టెన్సీ ఉండేనా.. ఊడేనా..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 14, 2023
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దురదృష్టం వెంటాడుతోంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమి ప్రభావం రోహిత్ పై గట్టిగానే పడింది. 36ఏళ్ల రోహిత్ శర్మ టెస్టు జట్టు కెప్టెన్‌గా ఇక ఎంతోకాలం కొనసాగే అవకాశం లేదని తెలుస్తోంది. బహుశా వెస్టిండీస్ తో జరిగే రెండు టెస్టుల సిరీస్ అతడి నాయకత్వానికి చివరిది కావచ్చని సమాచారం. ఒకవేళ విండీస్ సిరీస్ గెలవకపోతే ఇక అతడు టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బ్యాటింగ్ లో రాణించలేకపోతున్న రోహిత్ కరేబీయన్ టూరులో కచ్చితంగా భారీ స్కోర్లు సాధించాల్సి ఉంటుంది. లేకపోతే బీసీసీఐ అతడిపై కఠిన చర్యలు తీసుకొనే ప్రమాదం ఉంది.

Details

డేంజర్‌లో రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ

డబ్ల్యూటీసీ సైకిల్(2023-25) ముగిసేంతవరకు రోహిత్ కెప్టెన్‌గా ఉంటాడో లేదో రిటైర్ అవుతారో వేచి చూడాలి. విండీస్‌తో సిరీస్ ముగిశాక డిసెంబర్ వరకు టీమిండియా టెస్టులు ఆడే అవకాశం లేదు. ఆ తర్వాతే భారత్ దక్షిణాఫ్రికాకు వెళుతుంది. కాబట్టి అప్పటి వరకు కొత్త సారిథి ఎంపికపై చర్చించడానికి సెలెక్టర్లకు కావాల్సినంత సమయం కూడా ఉంటుంది. ప్రస్తుతానికి శివసుందర్ దాస్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ రోహిత్ బ్యాటింగ్ ఫామ్ ను చూశాకే ఏ నిర్ణయమైనా తీసుకొనుంది. రోహిత్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఇండియా 10 టెస్టు మ్యాచులు ఆడింది. ఇందులో మూడు టెస్టులకు అతను దూరంగా ఉన్నాడు. మిగతా ఏడు టెస్టుల్లో అతను కేవలం 390 రన్స్ మాత్రమే చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది.