Page Loader
అశ్విన్‌ను చాలా అవమానించారు.. టీమిండియా మాజీ లెజెండ్ ఫైర్!
రవిచంద్రన్ అశ్విన్

అశ్విన్‌ను చాలా అవమానించారు.. టీమిండియా మాజీ లెజెండ్ ఫైర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 13, 2023
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పించడంపై టీమిండియా మాజీ లెజెండ్ సునీల్ గవాస్కర్ మరోసారి ఫైర్ అయ్యాడు. ఐపీఎల్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అశ్విన్ అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్ లో కూడా ఫర్వాలేదనిపించాడు. ఇలాంటి అటగాడిని డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆడించకపోవడంపై కొందరు మాజీలు టీమిండియాను తిట్టిపోస్తున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లో ఎక్కువగా ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఉండడం, వారిపైనా అశ్విన్‌ను రికార్డు అద్భుతంగా ఉండటంతో అతన్ని కచ్చితంగా తీసుకుంటారని భావించారు అయితే పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని తెలియడంతో అశ్విన్ ను పక్కన పెట్టారు. దీనిపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Details

అశ్విన్ విషయంలో దారుణంగా ప్రవర్తించారు

ఈ మధ్య కాలంలో ఏ టాప్ క్లాస్ ఇండియన్ క్రికెటర్ కు ఇంత అవమానం జరగలేదని, అశ్విన్ విషయంలో టీమిండియా ఎప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తోందని గవాస్కర్ మండిపడ్డాడు. అశ్విన్ కు ఇలా జరగడం కొత్తేమీ కాదని, అసలు ఇలాంటి నిర్ణయాల వల్లే అతను ఇంకా 100 టెస్టుల మైలురాయిని చేరుకోలేదని, ఒక టాప్ క్లాస్ ఆటగాడిని ఇంత దారుణంగా ట్రీట్ చేయడం తానెప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం నెంబర్ వన్ టెస్టు బౌలర్ అయిన అశ్విన్ తన కెరీర్‌లో 92 మ్యాచులను ఆడాడు. ఇందులో 474 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా 32 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.