
కోహ్లీ అలా చేయడంతో షాక్ అయ్యా.. ఇక రోహిత్ శర్మనే బెస్ట్ అనిపించాడు : గంగూలీ
ఈ వార్తాకథనం ఏంటి
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓడిపోయిన విషయం తెలిసిందే.
దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక రోహిత్ టెస్టులకు పనికిరాడని, వెంటనే కెప్టెన్సీ నుంచి అతన్ని తప్పించాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు.
రోహిత్ కంటే విరాట్ కోహ్లీ ఎంతో బెటర్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో కింగ్ కోహ్లీని ఉద్ధేశించి టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
కోహ్లీ టెస్టు క్రికెట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని తాము ఎప్పుడూ కోరుకోలేదని, అతను ఆ నిర్ణయం తీసుకోవడంతో తాను షాక్ అయ్యానని గంగూలీ పేర్కొన్నారు.
Details
వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ గెలవడం కష్టం
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్న తర్వాత సెలక్టర్లకు ఓ కెప్టెన్ అవసరం వచ్చిందని, ఆ సమయంలో రోహిత్ బెస్ట్ అనిపించాడని, అతని సారథ్యంలో ముంబై ఐదు ఐపీఎల్ టైటిల్స్, టీమిండియా ఆసియా కప్ గెలిచిందని గంగూలీ తెలిపాడు.
కాగా ఐపీఎల్ కారణంగానే టీమిండియా ఐసీసీ ఈవెంట్‌లో రాణించలేకపోతుందని పలువురు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ విషయంపై కూడా దాదా స్పందించాడు. వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరాలంటే నాలుగైదు మ్యాచులు గెలిస్తే చాలని, అదే ఐపీఎల్ లో గెలవాలంటే 17 మ్యాచులు గెలవాలని ఆజ్ తక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ చెప్పారు.