ముందు ఇంగ్లీష్ నేర్చుకోండ్రా.. కోహ్లీ ఫ్యాన్స్ పై దాదా అగ్రహం
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరబ్ గంగూలీ మధ్య విభేదాలు ఎప్పటి నుంచో కొనసాగుతున్నాయి. బీసీసీఐ ప్రెసిడెంట్ గా గంగూలీ ఉన్నప్పుడే కోహ్లీ తన కెప్టెన్సీ పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. ఉద్ధేశపూర్వకంగానే గంగూలీ తనను తప్పించాడని అప్పట్లో కోహ్లీ ఆరోపించాడు. ఈ విషయాన్ని పలుమార్లు కోహ్లీ పరోక్షంగా బయటపెట్టాడు. ఐపీఎల్ 2023 సీజన్ లోనూ ఒకరికొకరు ఎదురుపడినా కనీసం పలకరించుకోకపోవడం గమనార్హం. ఈ మధ్యనే ఇరువురు సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఈసీజన్లో ఆర్సీబీ ఆడిన చివరి రెండు లీగ్ మ్యాచుల్లోనూ కోహ్లీ వరుస సెంచరీలతో సత్తా చాటాడు. సన్ రైజర్స్ తో పాటు గుజరాత్ పై కోహ్లీ సెంచరీలతో చెలరేగిపోయాడు.
సౌరబ్ గంగూలీని ట్రోల్ చేసిన కోహ్లీ అభిమానులు
అదే విధంగా గుజరాత్ స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ కూడా వరుస సెంచరీలతో ఈ సీజన్లో సత్తా చాటాడు. సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ పై గిల్ సెంచరీలను బాదాడు. దీంతో శుభ్‌మాన్ గిల్ సెంచరీలు సాధించడంతో సౌరబ్ గంగూలీ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించాడు. ఈ దేశంలో ఎంతోమంది టాలెంటెండ్ బ్యాట్స్ మెన్స్ ఉన్నారని, శుభ్‌మాన్ గిల్ ఓ అద్భుతమని, ఐపీఎల్ లో ఎలాంటి ప్రమాణాలు ఉన్నాయో అనేదానికి ఈ సెంచరీలు నిదర్శమని గంగూలీ ట్విట్ చేశారు. అయితే గిల్ ఒక్కడినే కొనియాడటాన్ని కోహ్లీ అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీనిపై స్పందించిన గంగూలీ ముందు ఇంగ్లీష్ అర్ధం చేసుకోవడం నేర్చుకోవాలని, లేకుంటే బాగా తెలిసిన వారితో చెప్పించుకోవాలని పేర్కొన్నారు.