
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీకి భద్రత పెంచుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఉన్న వీవీఐపీ సెక్యూరిటీ గడువుకు సమయం ముగియడంతో తాజాగా భద్రతను మరింత పెంచారు. ఈ విషయాన్ని ఓ ప్రభుత్వాధికారి ధ్రువీకరించారు.
జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కింద గంగూలీ వెనక ఎప్పుడూ 8 నుంచి 10 మంది పోలీసు అధికారులు రక్షణగా ఉండనున్నారు.
కోల్ కతాలోని గంగూలీ బెహాలా కార్యాలయంలో ఏర్పాటు చేసి రివ్యూ మీటింగ్ లో అధికారులు గంగూలీ భద్రతపై చర్చించారు.
గంగూలీ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరక్టర్ గా ఉన్నారు. మే 21న అతను కోలకతాకు చేరుకోగానే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించనున్నారు.
Details
గతంలో ధోనికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ
పశ్చిమ బెంగాల్ లో సీఎంతో పాటు గవర్నర్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, పలువురు మంత్రులకు మాత్రమే జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది.
ప్రస్తుతం గంగూలీకి జెడ్ కేటగిరి భద్రత కారణంగా బెహలా ప్రాంతంలోని ఆయన ఇంటి వద్ద 24 గంటల పాటు ఇద్దరు ప్రత్యేక భద్రత అధికారులు కాపలాగా వ్యవహరించనున్నారు.
సాధారణంగా దాడి జరగొచ్చనే ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం ప్రభుత్వం భద్రతను పెంచుతుంది.
అయితే గతంలో మహేంద్ర సింగ్ ధోనికి ఇంటెలిజెన్స్ అధికారుల సూచనలతో జెడ్ కేటగిరి సెక్యూరిటీని కల్పించిన విషయం తెలిసిందే.