విండీస్ టూర్‌కు టీమిండియా సీనియర్లపై వేటు.. యువ ఆటగాళ్లకు చోటు..?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలే ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్ పైనల్లో టీమిండియా రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోవడంతో సీనియర్ ఆటగాళ్లపై వేటు పడే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
టెస్టుల్లో కీలక ఆటగాళ్లు అయిన ఛతేశ్వర్ పుజారా, ఉమేష్ యాదవ్ లకు పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే విండీస్ టూరులో వీళ్లిద్దరినీ బీసీసీఐ తప్పించనున్నట్లు సమాచారం. డబ్ల్యూటీసీ ఫైనల్లో పుజారాపై టీమిండియా భారీ ఆశలను పెట్టుకుంది.
అయితే రెండు ఇన్నింగ్స్ లో అతను నిరాశపరిచాడు. దీంతో పుజారాను తప్పించి యువ ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్లు వినిపించాయి.
Details
విండీస్ టూర్ లో యువ ప్లేయర్లకు అవకాశం!
ముఖ్యంగా ఉమేష్ యాదవ్ కెరీర్ కు ఎండ్ కార్డే పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఫామ్ కోల్పోయి భారత జట్టుకు చాలాకాలంగా దూరంగా ఉన్న ఉమేష్ డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం అట్టర్ ప్లాఫ్ అయ్యాడు. వికెట్ కీపర్ కేఎస్ భరత్ దారుణంగా విఫలమయ్యాడు.
ఉమేష్, పుజారా, కేఎస్ భరత్ స్థానంలో దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్న యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్ లతో పాటు పంజాబ్ కింగ్స్ కీపర్ జీతేష్ శర్మకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
జులై 12న ప్రారంభమయ్యే విండీస్ పర్యటనలో టీమిండియా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచులను ఆడనుంది.