Evin Lewis: రిటైర్మెంట్‌ను రద్దు చేసుకున్న వెస్టిండీస్ స్టార్
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్ జట్టుకు చెందిన దూకుడైన ఓపెనర్ ఎవిన్ లూయిస్ ఇటీవల తీసుకున్న నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. టీ20 వరల్డ్ కప్ జట్టులో తనకు అవకాశం రాలేదన్న నిరాశతో గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతను, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. తన రిటైర్మెంట్‌ను అధికారికంగా వెనక్కి తీసుకున్నాడు. ఇంతటితో ఆగకుండా, లూయిస్ మరో ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు. ఇప్పటివరకు పరిమిత ఓవర్ల క్రికెటర్‌గా మాత్రమే గుర్తింపు పొందిన అతను, తొమ్మిదేళ్ల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడాలని ఆసక్తి వ్యక్తం చేశాడు. ఈ దిశగా ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు తరఫున నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొని తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు.
వివరాలు
లూయిస్ కెరీర్ రికార్డులివే..
వన్డేలు: 67 మ్యాచ్‌లలో 2175 పరుగులు, అందులో 5 శతకాలు టీ20లు: 65 మ్యాచ్‌లలో 1782 పరుగులు, అందులో 2 శతకాలు అంతర్జాతీయ క్రికెట్‌లో 176 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 125 పరుగులు సాధించిన రికార్డు అతని పేరిట ఉంది.