NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Bangladesh:  సొంత గడ్డపై పాకిస్థాన్‌ కి ఘోర ఓటమి.. టెస్టును క్లీన్‌స్వీప్‌ చేసిన  బంగ్లాదేశ్‌  
    తదుపరి వార్తా కథనం
    Bangladesh:  సొంత గడ్డపై పాకిస్థాన్‌ కి ఘోర ఓటమి.. టెస్టును క్లీన్‌స్వీప్‌ చేసిన  బంగ్లాదేశ్‌  
    సొంత గడ్డపై పాకిస్థాన్‌ కి ఘోర ఓటమి.. టెస్టును క్లీన్‌స్వీప్‌ చేసిన బంగ్లాదేశ్‌

    Bangladesh:  సొంత గడ్డపై పాకిస్థాన్‌ కి ఘోర ఓటమి.. టెస్టును క్లీన్‌స్వీప్‌ చేసిన  బంగ్లాదేశ్‌  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 03, 2024
    04:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ దుమారం రేపింది. దేశంలో జరుగుతున్న నిరసనలు, అల్లర్లలో తమ దేశం అట్టుడుకుతున్న పరిస్థితుల్లో కూడా వారు ప్రేరణనిచ్చే ప్రదర్శనతో అదరగొట్టారు.

    పాకిస్థాన్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించారు. పాకిస్థాన్‌పై టెస్టు సిరీస్‌ను బంగ్లాదేశ్‌ గెలుచుకోవడం ఇదే మొదటిసారి.

    రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో, బంగ్లాదేశ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి, రెండు ఇన్నింగ్స్‌లలోనూ బంగ్లాదేశ్‌ బలమైన ప్రదర్శనను కనబరిచింది.

    మంగళవారం, ఐదవ రోజు ఆట ప్రారంభించగా, ఓవర్‌ నైట్ స్కోరు 42/0తో ఉన్న బంగ్లాదేశ్‌ 56 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

    వివరాలు 

    బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 26 పరుగులకే ఆరు వికెట్లు 

    జకీర్‌ హసన్‌ (40),షాద్మాన్‌ ఇస్లామ్‌ (24),నజ్ముల్ హొస్సేన్ శాంటో (38),మోమినుల్ హక్ (34),ముష్పీకర్‌ రహీమ్ (22*),షకీబ్‌ అల్ హసన్ (21*)వంటి ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు.

    పాక్‌ బౌలర్లలో మీర్ హంజా,షాజాద్, అబ్రార్ అహ్మద్,ఆఘా సల్మాన్‌ ఒక్కొక్కరికీ వికెట్ తీసుకున్నారు.

    మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ 274 పరుగులకు ఆలౌటైంది.బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 26 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

    లిటన్ దాస్‌ (138),మెహదీ హసన్‌ మిరాజ్‌(78) అద్భుత బ్యాటింగ్‌ చేసిన తర్వాత 262 పరుగులకు ఆలౌటయ్యారు.

    వివరాలు 

    రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా అద్భుత బౌలింగ్‌

    రెండో ఇన్నింగ్స్‌లో,బంగ్లా పేసర్లు హసన్‌ మహ్మద్‌ (5/43),నహీద్‌ రాణా (4/44)అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన కనబరిచారు,దీంతో పాకిస్థాన్‌ను 172 పరుగులకు ఆలౌట్‌ చేశారు.

    సల్మాన్‌ ఆఘా (47 నాటౌట్‌), మహ్మద్‌ రిజ్వాన్‌ (43) పోరాడకపోతే, పాక్‌ ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగ్లాదేశ్
    పాకిస్థాన్

    తాజా

    Royal Enfield EV: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల రాయల్ ఎన్‌ఫీల్డ్
    Akashteer: దాయాది పాక్ కి దడ పుట్టించిన 'ఆకాష్‌టీర్'.. దీని ప్రత్యేకతలు ఇవే.. ఐరన్‌ డోమ్‌
    Indus treaty: 'ఇలా అయితే తీవ్ర దుర్భిక్షం నెలకుంటుంది': సింధూ జలాలపై పునఃసమీక్షించండి.. భారత్‌కు పాకిస్థాన్‌ విజ్ఞప్తి పాకిస్థాన్
    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్

    బంగ్లాదేశ్

    Bangladesh: రేపు భారత్‌కు  బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా..కీలక అంశాలపై చర్చ..! అంతర్జాతీయం
    Bangladesh: బంగ్లాదేశ్ యువకుడు అదృశ్యం.. కుటుంబ సభ్యులు ఫిర్యాదు  పశ్చిమ బెంగాల్
    Bangladesh: బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనలు.. 105 మంది మృతి.. 2500 మందికి గాయాలు  అంతర్జాతీయం
    Bangladesh: బంగ్లాదేశ్ నుండి తిరిగి వచ్చిన 1,000 మంది భారతీయులు..    నిరసనలలో 115 మంది మృతి  అంతర్జాతీయం

    పాకిస్థాన్

    U19 World Cup 2024: ఆస్ట్రేలియాతో సెమీ-ఫైనల్‌లో ఓడిన పాకిస్థాన్.. గ్రౌండ్ లో ఏడ్చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లు!  క్రికెట్
    Pakistan poll result: లండన్ ప్లాన్ విఫలమైంది: ఇమ్రాన్ ఖాన్ 'విక్టరీ' స్పీచ్  ఇమ్రాన్ ఖాన్
    Pakistan Elections: పాకిస్థాన్ ఎన్నికల్లో రిగ్గింగ్.. రీ పోలింగ్‌కు ఎన్నికల సంఘం నిర్ణయం తాజా వార్తలు
    Pakistan election: నవాజ్ షరీఫ్‌, బిలావల్ భుట్టో మధ్య కుదిరిన ఒప్పందం.. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు  ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025