Loading...
T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో వేగవంతమైన అర్ధశతకాలు.. అగ్రస్థానంలో యూవీ.. మిగతా ప్లేయర్ల స్థానం ఎంతంటే?
టీ20 వరల్డ్‌కప్‌లో వేగవంతమైన అర్ధశతకాలు.. అగ్రస్థానంలో యూవీ.. మిగతా ప్లేయర్ల స్థానం ఎంతంటే?

T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో వేగవంతమైన అర్ధశతకాలు.. అగ్రస్థానంలో యూవీ.. మిగతా ప్లేయర్ల స్థానం ఎంతంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ 2026లో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ 'షిమ్రాన్ హెట్‌మయర్' సంచలన ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. సూపర్-8 దశలో భాగంగా ముంబైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో వెస్టిండీస్ తరఫున అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ నమోదు చేశాడు. హెట్‌మయర్‌ దూకుడు బ్యాటింగ్‌తో వెస్టిండీస్ భారీ తేడాతో గెలిచి, గ్రూప్-1 నుంచి సెమీఫైనల్ రేసులో ముందంజ వేసింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ప్రతి జట్టు తరఫున నమోదైన వేగవంతమైన అర్ధశతకాలపై ఓసారి దృష్టి పెడితే ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. భారత తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు మాజీ ఆల్‌రౌండర్ 'యువరాజ్ సింగ్' పేరిట ఉంది.

Details

కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

2007లో ఇంగ్లాండ్‌పై ఆయన కేవలం 12 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, టోర్నీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా నిలిచాడు.

ఆస్ట్రేలియా తరఫున మార్కస్ స్టోయినిస్ 2022లో శ్రీలంకపై 17 బంతుల్లో ఫిఫ్టీ నమోదు చేయగా, పాకిస్తాన్ వెటరన్ షోయబ్ మాలిక్ 2021లో స్కాట్లాండ్‌పై 18 బంతుల్లో అర్ధశతకం బాదాడు.

శ్రీలంక తరఫున కెప్టెన్ దాసున్ శనక 2026లో ఒమాన్‌పై 19 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు.

దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ న్యూజిలాండ్‌పై 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు.

Details

21 బంతుల్లో హాఫ్ సెంచరీ

బంగ్లాదేశ్ తరఫున 2007లో మహమ్మద్ అష్రాఫుల్ 20 బంతుల్లో ఫిఫ్టీ నమోదు చేయగా, జింబాబ్వే బ్యాటర్ ఎల్టన్ చిగుంబురా 2014లో యూఏఈపై 21 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.

ఇంగ్లండ్ తరఫున 2026లో ఇటలీపై విల్ జాక్స్ 21 బంతుల్లో అర్ధశతకం నమోదు చేశాడు.

న్యూజిలాండ్‌కు గ్లెన్ ఫిలిప్స్ 2026లో కెనడాపై 22 బంతుల్లో ఫిఫ్టీ సాధించగా, అఫ్గానిస్తాన్ తరఫున షఫీకుల్లా 2014లో హంగేరీపై 24 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు.

ADVERTISEMENT

Details

టీ20 వరల్డ్‌కప్‌లో వేగవంతమైన ఫిఫ్టీలు

12 బంతులు - యువరాజ్ vs ఇంగ్లండ్, 2007

17 బంతులు - మైబర్గ్ vs ఐర్లాండ్, 2014

17 బంతులు - స్టోయినిస్ vs శ్రీలంక, 2022

18 బంతులు - మాలిక్ vs స్కాట్లాండ్, 2021

19 బంతులు - షనక vs ఒమెన్, 2026

19 బంతులు - మార్క్రామ్ vs న్యూజిలాండ్, 2026

19 బంతులు - హెట్‌మయర్ vs జింబాబ్వే, 2026

20 బంతులు - అష్రఫుల్ vs వెస్టిండీస్, 2007

21 బంతులు - చిగుంబురా vs యూఏఈ, 2014

22 బంతులు - జోన్స్ vs కెనడా, 2024

22 బంతులు - బెన్ మనేంటి vs ఇంగ్లండ్, 2026

ADVERTISEMENT

Details

ఆ జాబితాలో స్థానం సంపాదించుకున్న హెట్‌మయర్

22 బంతులు - గ్లెన్ ఫిలిప్స్ vs కెనడా, 2026

24 బంతులు - షఫీకుల్లా vs హాకాంగ్, 2014

ఇలా టీ20 ప్రపంచకప్ చరిత్రలో పలు దేశాల ఆటగాళ్లు తమ దూకుడు ఇన్నింగ్స్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా హెట్‌మయర్‌ కూడా ఆ జాబితాలో స్థానం సంపాదించి కరీబియన్ అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు.

ADVERTISEMENT