Page Loader
FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్: భారత జట్టు సాధించిన అరుదైన రికార్డులు ఇవే!
భారత జట్టు సాధించిన అరుదైన రికార్డులు ఇవే!

FIFA ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్: భారత జట్టు సాధించిన అరుదైన రికార్డులు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 08, 2023
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫుట్ బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి నేతృత్వంలో ఇటీవల భారత్ దూసుకెళ్తుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ లో చైనాలోని హాంగ్జో వేదికగా ఆసియా క్రీడలు జరగనున్నాయి. చాలా పేలవంగా ఉన్న తమ ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్ రికార్డును మెరుగుపరచుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకొంది. 2022 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. చివరికి 2023 ఆసియాకప్‌కు అర్హత సాధించారు. కానీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత్ ఈసారి మూడో రౌండ్‌కు చేరుకోవాలని తహతహలాడుతోంది. 1986లో ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో మొదటి మ్యాచ్ ఇండోనేషియాతో జరిగింది.ఇందులో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది. భారత్ తరఫున క్రిషాను దే ఒక్కడే గోల్ చేశాడు. తర్వాత థాయ్‌లాండ్‌పై రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకోగా.. బంగ్లాదేశ్‌పై రెండింటిని గెలుపొందారు.

Details

సునీల్ ఛెత్రికి మెరుగైన రికార్డు

ఓవరాల్‌గా భారత్ ఏడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇండోనేషియా తొమ్మిది పాయింట్లతో ముందుకెళ్లింది. 1998 ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో టీమిండియాకు దురదృష్టం వెంటాడింది. కేవలం ఒక్క గోల్ తేడాతో మూడవ స్థానంలో నిలిచిపోయారు. సునీల్ ఛెత్రి ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచుల్లో తొమ్మిది గోల్స్ చేశాడు. ఈ పోటీలో భారత్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఛెత్రి రికార్డుకెక్కాడు. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఐదు గోల్స్‌తో విజయన్ రెండో స్థానంలో ఉన్నాడు. వీపీ సత్యన్, జో పాల్ అంచేరి చెరో మూడు గోల్స్ చేసి తర్వాతి స్థానంలో నిలిచారు.