
Shubman Gill: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు.. అద్భుత రికార్డులపై కన్నేసిన గిల్?
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో అసాధారణ రీతిలో రికార్డులు నమోదు చేస్తున్నాడు. తొలిసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ, తన నాయకత్వం ద్వారా జట్టును విజయ మార్గంలో నడిపిస్తూ, బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో గిల్ 722 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలు ఉండగా, అత్యధిక వ్యక్తిగత స్కోరు 269 పరుగులు కావడం విశేషం. ఐదో టెస్టు ముందు గిల్ కొన్ని ప్రధాన రికార్డులపై కన్నేశాడు. ఒకే టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలవడానికి గిల్‌కు ఇప్పుడు మరో 53 పరుగులే అవసరం. ప్రస్తుతం ఈ రికార్డు సునీల్ గావస్కర్ పేరిట ఉంది.
Details
డాన్ బ్రాడ్‌మన్ రికార్డుకూ ఛాలెంజ్
ఆయన 1971లో వెస్టిండీస్‌పై ఆడిన సిరీస్‌లో 774 పరుగులు చేసి, 154.80 సగటు సాధించారు. అంతర్జాతీయంగా టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. ఆయన 1930 యాషెస్ సిరీస్‌లో 974 పరుగులు చేశారు. గిల్ ఈ రికార్డును అధిగమించాలంటే ఇంకా 253 పరుగులు చేయాలి. ఇది సాధ్యమవాలంటే ఓ భారీ డబుల్ సెంచరీ లేదా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకాలు అవసరం.
Details
సారథిగా అంతర్జాతీయ స్థాయిలో నిలిచేందుకు 89 పరుగులు చాలు
గిల్ ప్రస్తుతం ఒక టెస్టు సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా నిలిచాడు. అయితే అంతర్జాతీయంగా బ్రాడ్‌మన్ పేరిట ఉన్న 810 పరుగుల రికార్డును అధిగమించాలంటే గిల్‌కి మరో 89 పరుగులు అవసరం. బ్రాడ్‌మన్ ఈ రికార్డును 1936-37 సీజన్‌లో ఇంగ్లాండ్‌పై ఐదు టెస్టుల్లో నమోదు చేశాడు.
Details
బ్రాడ్‌మన్, గావస్కర్‌ను వెనక్కినెట్టే అవకాశం
ప్రస్తుతం గిల్ నాలుగు శతకాలు చేయగా, కెప్టెన్‌గా టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన డాన్ బ్రాడ్‌మన్ (1947, ఇంగ్లాండ్‌పై) సునీల్ గావస్కర్ (1978, వెస్టిండీస్‌పై) నాలుగేసి సెంచరీలు చేశారు. గిల్ ఓ శతకం మరింత చేస్తే, కెప్టెన్‌గా అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్‌గా చరిత్రలో స్థానం దక్కించుకోనున్నాడు. 'ఓవల్' వేదికగా జరిగే ఐదో టెస్టులో గిల్ పై చెప్పిన రికార్డులను బద్దలుకొట్టి అరుదైన ఘనతలు సాధించగలడేమో చూడాలి.