Asia Cup Final : రేపే భారత్‌తో ఫైనల్.. గాయాలతో సతమతమవుతున్న శ్రీలంక
ఆసియా కప్ 2023 ఫైనల్ మ్యాచులో భాగంగా రేపు భారత్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఇరు జట్లు గత మ్యాచులో పోటీపడినప్పుడు టీమిండియా జట్టు 41 పరుగుల తేడాతో గెలుపొందింది. మరోవైపు బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచులో టీమిండియా పరాజయం పాలైంది. ఆదివారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకున్నాయి. ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇరు జట్లు ఇప్పటివరకూ 166 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో టీమిండియా 97 మ్యాచుల్లో, శ్రీలంక 57 మ్యాచుల్లో గెలుపొందింది. ఆసియాకప్ వన్డే ఫార్మాట్లో శ్రీలంక, భారత్ పై తొమ్మిది విజయాలు, 11 ఓటములు కలిగి ఉంది.
గాయం కారణంగా ఫైనల్ కు దూరమైన మహేశ్ తీక్షణ
ఈ ఫైనల్ మ్యాచుకు మహేశ్ తీక్షణ దూరం కావడంతో శ్రీలంక జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే శ్రీలంక నుంచి హసరంగ, చమీరా, మధుశంక, లహిరు కుమార వంటి ప్రధాన బౌలర్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. శ్రీలంక జట్టు పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (డబ్ల్యూకే), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (సి), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, కసున్ రజిత, మతీషా పతిరన. భారత జట్టు రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (డబ్ల్యుకె), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.