WPL 2025 Final: ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్.. గెలుపు ఎవరిదో?
ఈ వార్తాకథనం ఏంటి
WPL 2025 ఫైనల్ మ్యాచ్ నేడు (మార్చి 15) ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది.
మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్‌లో గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచి వరుసగా మూడోసారి ఫైనల్‌కు అర్హత సాధించింది.
గత రెండు సీజన్లలో ఫైనల్‌కు చేరినా ట్రోఫీని ఢిల్లీ ముద్దాడలేకపోయింది. ఈసారి మాత్రం విజయం సాధించేందుకు గట్టి పోరాటం చేయనుంది.
Details
ఆధిక్యంలో ఢిల్లీ
మరోవైపు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్ గ్రూప్ దశను రెండో స్థానంలో ముగించి, ఎలిమినేటర్‌లో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.
ముంబై జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లో ఢిల్లీని ఓడించి ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే ఘనతను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సీజన్‌లో గ్రూప్ దశలో ఢిల్లీ, ముంబై జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ విజయం సాధించింది.
అంతేకాకుండా ఇప్పటి వరకు జరిగిన 7 మ్యాచుల్లో ఢిల్లీ నాలుగు మ్యాచుల్లో గెలుపొందగా, ముంబై 3 మ్యాచుల్లో నెగ్గింది.
ఈ గణాంకాలను బట్టి చూస్తే ఢిల్లీ జట్టుకే స్వల్ప ఆధిక్యం ఉందని చెప్పొచ్చు.
Details
రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం
ఈసారి ఢిల్లీ తన తొలి టైటిల్ సాధిస్తుందా? లేక ముంబై మరోసారి విజేతగా నిలుస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ ఫైనల్ మ్యాచ్ టాస్ సాయంత్రం 7 గంటలకు నిర్వహించనున్నారు. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ హై-వోల్టేజ్ ఫైనల్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్‌లో వీక్షించవచ్చు. అదేవిధంగా, JioHotstar యాప్, వెబ్‌సైట్‌లో కూడా లైవ్ ప్రసారం అందుబాటులో ఉంటుంది.