Asia Cup: శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్.. భారత జట్టులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్
ఆసియా కప్ సూపర్-4లో భాగంగా బంగ్లా చేతిలో భారత్ ఓటమిపాలైంది. ఈ మ్యాచులో శుభ్‌మాన్ గిల్, అక్షర్ పటేల్ పోరాడినా పరాజయం తప్పలేదు. భారత్ గెలిపించేందుకు అక్షర్ పటేల్ శతవిధాలా ప్రయత్నించాడు. స్టంపౌట్ నుంచి తప్పించుకొనే క్రమంలో అతని వేలికి గాయమైంది. ఆ తర్వాత కాసేపటికే బంగ్లాదేశ్ ఫీల్డర్ దూరం నుంచి విసిరిన బంతి అక్షర్ పటేల్ చేతిని తాకింది. గాయపడిన అక్షర్ పటేల్ కోలుకోవడం కష్టమని తెలుస్తోంది. ఈ తరుణంలో అక్షర్ పటేల్ స్థానంలో మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
గాయంతో బాధపడుతున్న అక్షర్ పటేల్
అక్షర్ పటేల్ గాయాలతో భాదపడుతున్నాడని, చిటికెన వేలు, మోచేయికి గాయం కావడంతో తొడ కండరాలు పట్టేశాయని, దీంతో అతనికి విశ్రాంతి ఇచ్చి అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి తీసుకుంటున్నామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అక్షర్ పటేల్ మోచేతికి వాప్ రావడంతో అతను వరల్డ్ కప్ ఆడతాడా లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇక వాషింగ్టన్ సుందర్ ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ లో ఆడాడు. మరోవైపు ఆసియా గేమ్స్ కోసం ప్రకటించిన భారత జట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్ ఇప్పటివరకూ భారత్ తరుఫున 16 వన్డే మ్యాచులను ఆడాడు. ఇందులో 233 పరుగులు, 16 వికెట్లను పడగొట్టాడు.