NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / First International Cricket Match: క్రికెట్​లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? 
    తదుపరి వార్తా కథనం
    First International Cricket Match: క్రికెట్​లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? 
    క్రికెట్​లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?

    First International Cricket Match: క్రికెట్​లో మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 06, 2024
    05:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో క్రికెట్ అంటే అందరికీ ఎంత ఇష్టమో తెలిసిందే.

    ఈ క్రీడను అభిమానించే ప్రతి ఒక్కరూ, క్రికెట్ మ్యాచ్ ప్రసారం అవుతున్నప్పుడు తమ ఇతర పనులను పక్కన పెట్టి, టీవీ ముందు కూర్చొని మ్యాచ్ చూస్తుంటారు.

    అయితే మనం ఎంతో ఇష్టపడే ఈ క్రికెట్‌లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరిగింది, ఇందులో భాగంగా భారత్ తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు ఆడింది వంటి అంశాలపై ఈ కథనంలో తెలుసుకుందాం.

    వివరాలు 

    ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌

    క్రికెట్‌లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది అంటే.. 1844లో న్యూయార్క్‌లోని సెయింట్ జార్జ్ క్రికెట్ క్లబ్ వేదికగా, అమెరికా, కెనడా జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కెనడా జట్టు 23 పరుగుల తేడాతో అమెరికాను ఓడించింది.

    ఇక మరికొంత మంది 1877లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌ను మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌గా భావిస్తారు. అయితే అది నిజం కాదు. అసలైన తొలి అంతర్జాతీయ మ్యాచ్ 1844లో అమెరికా-కెనడా జట్ల మధ్య వన్డే మ్యాచ్ అయ్యింది. ఇది మాత్రమే కాక, ఏకంగా రెండు దేశాల మధ్య జరిగిన మొదటి అంతర్జాతీయ క్రీడా పోటీ కూడా ఇదే కావడం విశేషం.

    వివరాలు 

    మొదటి ప్రపంచ కప్ విజేతగా వెస్టిండీస్

    మొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్ 1877 మార్చి 15 నుంచి 19 మధ్య, ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 45 పరుగుల తేడాతో విజయం సాధించింది.

    క్రికెట్ ప్రపంచ కప్ మొదటి సారి 1975లో జూన్ నెలలో ఇంగ్లాండ్‌లో జరిగింది. ఈ కప్‌లో వెస్టిండీస్ జట్టు విజేతగా నిలిచింది.

    అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 1909లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా దేశాల ప్రతినిధులతో "ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్"గా ప్రారంభమైంది. తరువాత, 1965లో దీన్ని "ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్"గా మార్చారు. 1987లో ఈ సంస్థను "అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)"గా పునర్నామకరణం చేశారు. ప్రస్తుతం దీని ప్రధాన కార్యాలయం దుబాయ్‌లో ఉంది.

    వివరాలు 

    టీమ్ ఇండియా కెప్టెన్‌గా సీకే నాయుడు

    భారత జట్టు ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ 1932 జూన్ 25న లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగింది. అప్పట్లో టీమ్ ఇండియా కెప్టెన్‌గా సీకే నాయుడు వ్యవహరించారు.

    ఈ మ్యాచ్‌లో భారత్ 158 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

    భారతదేశంలో జరిగిన మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ 1933లో ముంబయిలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ - భారత్ జట్లు తలపడ్డాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    క్రికెట్

    తాజా

    Banu Mushtaq: 'హార్ట్‌ల్యాంప్‌' కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌'కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ కర్ణాటక
    USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య..  అమెరికా
    Mohanlal: మోహన్‌లాల్‌ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు సినిమా
    Airlines Alert: భారీ వర్షం కారణంగా గోవాకు విమానాలు ఆలస్యంగా నడుస్తాయి: ఇండిగో  ఇండిగో

    క్రికెట్

    Amaravati: సీఎం చంద్రబాబును కలిసిన కపిల్‌దేవ్‌.. గోల్ఫ్ అభివృద్ధిపై చర్యలు  కపిల్ దేవ్
    BenStokes: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం  ఇంగ్లండ్
    Jasprit Bumrah: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఆస్తుల నుంచి ప్రేమకథ వరకు..! జస్పిత్ బుమ్రా
    IPL 2025 Retention Players: ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్టు.. ఏ జట్టు కీలక ఆటగాళ్లను కొనసాగించనుందో తెలుసా? ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025