తదుపరి వార్తా కథనం
IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 11, 2026
01:30 pm
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ మ్యాచ్ వడోదర వేదికగా జరుగుతోంది. చాలాకాలంగా జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ ఈ వన్డేతో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు రీఎంట్రీ ఇస్తున్నాడు. అనారోగ్య కారణాలతో రిషబ్ పంత్ ఈ వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌ను జట్టులోకి తీసుకున్నారు. భారత జట్టు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.