Page Loader
IND vs AUS : వర్షం కారణంగా తొలి సెషన్ రద్దు.. నిరాశపరిచిన భారత బౌలర్లు
వర్షం కారణంగా తొలి సెషన్ రద్దు.. నిరాశపరిచిన భారత బౌలర్లు

IND vs AUS : వర్షం కారణంగా తొలి సెషన్ రద్దు.. నిరాశపరిచిన భారత బౌలర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2024
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజు ఆట వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. బ్రిస్బేన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నా, అది సరైన నిర్ణయం కాకపోవచ్చని మొదటి సెషన్ ఆటతీరు సూచిస్తోంది. మ్యాచ్ ప్రారంభమైన కొన్ని ఓవర్లకే వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. 5.3 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేయాల్సి వచ్చింది. అరగంట తర్వాత ఆట తిరిగి ప్రారంభమైనా, మళ్లీ వర్షం రావడంతో మొత్తం 13.2 ఓవర్ల ఆట మాత్రమే జరగింది.

Details

పూర్తిగా తడిచిపోయిన మైదానం

వర్షంతో మైదానం పూర్తిగా తడిచిపోయింది. అయినప్పటికీ బ్రిస్బేన్‌లోని అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ కారణంగా ఆట తిరిగి సాధ్యమవుతుందని భావిస్తున్నారు. పిచ్‌పై పచ్చటి గడ్డిని చూసి తొలుత బౌలింగ్ చేయాలని రోహిత్ శర్మ నిర్ణయం తీసుకున్నాడు. అయితే భారత బౌలర్లు ఆ నిర్ణయాన్ని సమర్థించలేకపోయారు. పిచ్ పూర్తిగా ఫ్లాట్‌గా ఉండడంతో బంతి స్వింగ్ కాకపోవడం, స్టంప్‌లైన్ మిస్ చేయడం భారత బౌలర్లకు తీవ్ర ప్రతికూలతగా మారింది. జస్ప్రీత్ బుమ్రా 6 ఓవర్లు బౌలింగ్ చేసి, 3 మెయిడిన్లు వేశాడు. అతను కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చినా, బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి సృష్టించలేకపోయాడు.

Details

భారత బౌలర్లు పుంజుకోవాలి

ఈ మ్యాచ్‌లోకి కొత్తగా వచ్చిన ఆకాశ్ దీప్ 3.2 ఓవర్లలో 2 మెయిడిన్లు వేసి కేవలం 2 పరుగులు ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 2 మెయిడిన్లు వేశాడు. కానీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. మూడో టెస్టు తొలి రోజు ఆటలో వర్షం ప్రధాన పాత్ర పోషించగా, భారత బౌలర్ల ప్రదర్శన నిరాశ కలిగించింది. ఆట మిగతా సెషన్లలో భారత బౌలర్లు పుంజుకుంటారో లేదో వేయి చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మైదానంలో కురుస్తున్న వర్షం