
రికార్డు బద్దలు కొట్టిన ఎర్లింగ్ హాలాండ్
ఈ వార్తాకథనం ఏంటి
ఎతిహాద్‌లో జరిగిన UEFA ఛాంపియన్స్ లీగ్ రౌండ్ 16 సెకండ్-లెగ్ టైలో మాంచెస్టర్ సిటీ సత్తా చాటింది. లీప్‌జిగ్‌ను 7-0తేడాతో మాంచెస్టర్ సిటీ చిత్తు చేసింది. దీంతో సిటీ క్వార్టర్ ఫైనల్ కు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఎర్లింగ్ హాలాండ్ ఐదు గోల్స్ చేసి రికార్డును బద్దలు కొట్టాడు. UCL మ్యాచ్‌లో ఐదు గోల్స్ చేసిన మూడవ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అతను ఛాంపియన్స్ లీగ్‌లో అత్యంత వేగంగా 30 గోల్స్ చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు.
లూయిజ్ అడ్రియానో, లియోనెల్ మెస్సీ తర్వాత ఒకే ఛాంపియన్స్ లీగ్ గేమ్‌లో ఐదు గోల్స్ చేసిన మూడవ ఆటగాడిగా హాలాండ్ నిలిచాడు.
హాలాండ్
ఛాంపియన్ లీగ్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా హాలాండ్
హాలాండ్ ప్రస్తుతం 33 ఛాంపియన్స్ లీగ్ గోల్స్‌ను చేశాడు. UEFA ఛాంపియన్స్ లీగ్‌లో హాలాండ్ 30 గోల్స్ ను చేశారు. 25 మ్యాచ్‌లోనే ఈ మైలురాయిని అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. గతంలో రూడ్ వాన్ నిస్టెల్‌రూయ్ 34 మ్యాచ్‌లను ఆడి ఈ ఫీట్ ను సాధించాడు.
2022-23 సీజన్‌లో మాంచెస్టర్ సిటీ తరుపున 36 మ్యాచ్‌లను ఆడిన హాలాండ్ 39 గోల్స్ ను చేశాడు.
అతను ఛాంపియన్స్ లీగ్ 2022-23 సీజన్‌లో అత్యధికంగా 10 గోల్స్ చేశాడు ప్రస్తుతం ఏస్ మొహమ్మద్ సలా (8), ఎంబాప్పే (7)లను హాలాండ్ అధిగమించాడు. అదే విధంగా 26 ప్రీమియర్ లీగ్‌లో 28 గోల్స్ చేశాడు.