Kuldeep Yadav: పాక్‌పై కుల్దీప్ సూపర్ స్పెల్.. జీవితంలో గుర్తిండిపోతుంది : కుల్దీప్ యాదవ్
ఆసియా కప్‌లో పాకిస్థాన్ పై భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో కుల్దీప్ ఐదు వికెట్లతో చెలరేగి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాక్ ను 128 పరుగులకే ఆలౌట్ చేయడం వెనుక కుల్దీప్ యాదవ్ (8ఓవర్లలో 5/25) ప్రదర్శనే కారణమని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కుల్దీప్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తాను ఆట నుంచి దూరమైనప్పటికీ, ఈ స్పెల్ జీవితాంతం గుర్తిండిపోతుందని పేర్కొన్నారు. పాకిస్థాన్ జట్టుపై 5 వికెట్ల ప్రదర్శన చేయడం అద్భుతంగా అనిపిస్తోందన్నారు. స్పిన్ చక్కగా ఆడగలిగే ఉపఖండం జట్టుపై ఇలాంటి ప్రదర్శన చేయడం వల్ల మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.
భారత్ తరుఫున 87 వన్డేలు ఆడిన కుల్దీప్
గతేడాదిన్నర నుంచి తాను మంచి ఫామ్ లో ఉంటూ, నాణ్యమైన బౌలింగ్ వేస్తున్నానని, ఎప్పుడు అవకాశం వచ్చినా బౌలింగ్ ను ఆస్వాదించడం ఆలవాటు చేసుకున్నానని, ఐపీఎల్ సమయంలోనూ చాలా కష్టపడ్డానని కుల్దీప్ చెప్పుకొచ్చాడు. ఇక 2017లో వన్డేల్లోకి అరంగ్రేటం చేసిన కుల్దీప్ ఇప్పటివరకూ 87 వన్డేల్లో 146 వికెట్లను పడగొట్టాడు. అదే విధంగా భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023లోనూ భారత్ తరుఫున కుల్దీప్ స్థానం సంపాదించుకున్నాడు.