Page Loader
MS Dhoni: స్ట్రైక్‌రేట్ పై కాదు, స్థిరతపై దృష్టి పెట్టండి : ఎంఎస్ ధోని
స్ట్రైక్‌రేట్ పై కాదు, స్థిరతపై దృష్టి పెట్టండి : ఎంఎస్ ధోని

MS Dhoni: స్ట్రైక్‌రేట్ పై కాదు, స్థిరతపై దృష్టి పెట్టండి : ఎంఎస్ ధోని

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుపై రాజస్థాన్ రాయల్స్ (RR) 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ పోరులో చెన్నై ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనలో రాజస్థాన్ కేవలం 17.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

Details

 యువ ఆటగాళ్లకు ధోని సలహాలు

మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని యువ క్రికెటర్లకు కీలక సూచనలు చేశారు. మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురికావొద్దు. సీనియర్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందినుంచి నేర్చుకోవాలి. 200 ప్లస్ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేయాలనుకునే సమయంలో, బ్యాటింగ్‌లో స్థిరత సాధించడం సవాలే. అయినప్పటికీ, మ్యాచ్‌లో ఏ దశలోనైనా సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం యువ ఆటగాళ్లకు ఉందని ధోని వ్యాఖ్యానించాడు.

Details

చెన్నై ప్రదర్శనపై ధోని విశ్లేషణ 

తమ జట్టు ప్రదర్శనపై కూడా ధోని స్పందించాడు. "మేం మంచి లక్ష్యాన్ని విధించాం. కానీ ప్రారంభంలోనే వికెట్లు కోల్పోవడం వల్ల మిడిల్, లోయర్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగింది. బ్రెవిస్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్‌రేట్ బాగానే ఉంది. అయితే మేం ఆ మోమెంటమ్‌ను కొనసాగించలేకపోయామని ధోని వివరించాడు. అలాగే, పేసర్ కాంబోజ్ బౌలింగ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. కాంబోజ్ బంతులు మేము ఊహించిన దానికంటే వేగంగా వచ్చాయి. పవర్‌ప్లేలో మూడు ఓవర్లు బౌలింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడని కొనియాడాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను మే 25న గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది.