Page Loader
IPL 2024- RR Team-Dhruv Jurel: ఐపీఎల్ లో దూసుకుపోతున్న ఆర్ ఆర్ జట్టు..నాన్నకే సెల్యూట్ చేశా: ధ్రువ్ జురెల్
మ్యాచ్​ లో బ్యాటింగ్​ విన్యాసాలు చేస్తున్న ద్రువ్​ జురెల్

IPL 2024- RR Team-Dhruv Jurel: ఐపీఎల్ లో దూసుకుపోతున్న ఆర్ ఆర్ జట్టు..నాన్నకే సెల్యూట్ చేశా: ధ్రువ్ జురెల్

వ్రాసిన వారు Stalin
Apr 28, 2024
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ (IPL)17వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ (Rajathan Royals) క్రికెట్ జట్టు (Cricket team) మంచి జోరు మీద ఉంది. ఆడిన 9 మ్యాచ్ లలో 8 మ్యాచుల్లో గెలుపొంది రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరువయ్యింది. శనివారం రాత్రి లఖ్ నవూ (Lakhnavu) జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అలవోకగా గెలుపొందింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ సంజు శాంసన్ తోపాటు ధ్రువ్ జురెల్ అద్భుతంగా ఆడి రాజస్థాన్ రాయల్స్ జట్టును గెలిపించారు. సంజు శాంసన్ (71)తో పాటు జురెల్ (52) కూడా అర్థ సెంచరీ సాధించారు. జురెల్ అర్థ సెంచరీ సాధించగానే భావోద్వేగంతో తండ్రికి సెల్యూట్ చేశాడు.

Dhruv Jurel-IPL

మ్యాచ్ ముగించే అవకాశం వస్తే వదులుకోను: జురెల్

మ్యాచ్ అనంతరం ధ్రువ్ జురెల్ మాట్లాడుతూ..''నేను క్రికెట్​ మ్యాచ్ ముగించే అవకాశం ఎప్పుడు వచ్చినా అస్సలు వదులుకోను. మిడిల్ ఆర్డర్లో ఆడటం వల్ల నాపై మరింత బాధ్యత ఉందని భావిస్తాను. చివరి వరకు క్రీజ్ లో ఉంటే ఎంత పెద్ద లక్ష్యమైనా ఛేదించవచ్చు అని నేను బలంగా నమ్ముతాను. ఐపీఎల్​ పవర్ ప్లే లో ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే సర్కిల్ అవతల ఉంటారు కాబట్టి పరుగులు ఈజీగా రాబట్టేందుకు అదో మంచి అవకాశం. మిడిల్ ఓవర్లలో సర్కిల్ కు లోపల ఐదుగురు ఫీల్డర్లను దాటి బంతిని బౌండరీకి పంపించాలంటే టైమింగ్ చాలా ముఖ్యం. చాలా కష్టపడాలి ఈరోజు మ్యాచ్లో నేను కొట్టిన బంతులు నేరుగా ఫీల్డర్ల వద్దకు వెళ్లాయి.

Jurel Salute-IPL

హిట్టింగ్​ కాదు...టైమింగ్​ ముఖ్యం

ఆ సమయంలో సంజు శాంసన్ హిట్టింగ్ కాకుండా టైమింగ్ తో ఆడమని సూచించాడు. ఆ తర్వాత ఓవర్లు 20 పరుగులు చేయడంతో నాపై నమ్మకం పెరిగింది. నా తండ్రి వల్లే నేనిప్పుడు భారత జట్టులో ఆడగల్గుతున్నాను. ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో ఆడేటప్పుడు ఆయన ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు హాఫ్ సెంచరీ సమయంలో ఆయన నా దగ్గరే ఉండటం చాలా ఆనందంగా ఉంది. అందుకే హాఫ్ సెంచరీ తర్వాత ఆయనకు సెల్యూట్ చేశాను'' అని చెప్పాడు.