M.S.Dhoni: ఎంఎస్ ధోనిపై పరువు నష్టం కేసు.. జనవరి 18న విచారణ
భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనిపై పరువు నష్టం కేసు దాఖలైంది.ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, అతని భార్య సౌమ్య దాస్ పరువు నష్టం కేసును దాఖలు చేశారు. ధోని గతంలో తనను ₹15 కోట్ల మేర మోసం చేశారంటూ వారిద్దరిపై క్రిమినల్ కేసు పెట్టాడు. తమపై తప్పుడు ఆరోపణలు చేసి, తమ పరువుకు భంగం కలిగించినందుకు ధోనీ నష్టపరిహారం చెల్లించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమపై అవాస్తవాలను ప్రచారం చేయకుండా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు,మీడియా సంస్థలపై శాశ్వత నిషేధం విధించాలని కోరారు. ధోనీపై దాఖలైన పరువు నష్టం దావా జనవరి 18న జస్టిస్ ప్రతిభా ఎం సింగ్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రానుంది.
క్రికెట్ అకాడమీలు ఏర్పాటుకు ఎంఎస్ ధోనీతో ఒప్పందం
స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ 'ఆర్కా స్పోర్ట్స్' డైరెక్టర్లుగా ఉన్న దివాకర్, సౌమ్య విశ్వాస్‌లపై ధోనీ రాంచీలోని దిగువ కోర్టులో కేసు వేశారు. 2017లో ఈ ఇద్దరు నిందితులు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసేటట్టు ఎంఎస్ ధోనీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ఫ్రాంఛైజీ ఫీజు,లాభాల్లోని వాటాను ధోనీకి చెల్లించాలి.అయితే వారు ఒప్పందం చేసుకున్నట్లు ఫ్రాంఛైజీ ఫీజు,లాభాలు పంచడంలో కంపెనీ విఫలమవడంతో ధోనీ వైదొలిగాడు. ఆపై తనకు రావాల్సిన చెల్లింపులపై కోర్టును ఆశ్రయించాడు.
అక్టోబర్ 27న క్రిమినల్ కేసు నమోదు
కంపెనీ డైరెక్టర్స్ మిహిర్ దివాకర్, ఆయన భార్య సౌమ్య దాస్‌పై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ధోని నిందితులకు లీగల్ నోటీసులు కూడా అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)లోని సెక్షన్ 406, 420 కింద గతేడాది అక్టోబర్ 27న క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ధోని తరువు న్యాయవాది ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని తాజాగా దివాకర్ కొట్టిపడేయడమే కాకుండా ధోనీ తమ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ పరువు నష్టం దావా వేశారు.