Sarfaraz ahmed: క్రికెట్‌కు సర్ఫరాజ్ గుడ్ బై
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మూడు ఫార్మాట్ల క్రికెట్ నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు ఈ వికెట్ కీపర్, బ్యాటర్ అనౌన్స్ చేశాడు. ఈ సందర్భంగా సర్ఫరాజ్ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లలో పాకిస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం తనకు లభిస్తుందని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. 2006 అండర్-19 ప్రపంచకప్ విజయం, అలాగే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని క్షణాలు అని అన్నారు.
వివరాలు
మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్
పాకిస్థాన్ తరపున సర్ఫరాజ్ మొత్తం 54 టెస్ట్ మ్యాచ్‌లు, 117 వన్డేలు, 61 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 100 మ్యాచ్‌లలో జట్టుకు నాయకత్వం వహించాడు. చివరిసారిగా 2023 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ తరపున మైదానంలోకి దిగాడు.