LOADING...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలకు షాక్‌.. 57 క్లబ్‌లపై అనర్హత వేటు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలకు షాక్‌.. 57 క్లబ్‌లపై అనర్హత వేటు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పెద్దలకు షాక్‌.. 57 క్లబ్‌లపై అనర్హత వేటు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 01, 2023
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (HCA)లో ప్రక్షాళన చేపట్టిన సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీం ఏకసభ్య కమిటీ 57 క్లబ్‌లపై వేటు వేసింది. ఈమేరకు బహుళ క్లబ్‌లతో HCAను ఏలుతున్న క్రికెట్‌ పెద్దలకు షాకిచ్చింది. ఎన్నికల్లో ఒక దఫా లేదా 3 ఏళ్లు పోటీ చేయకుండా నిషేధం విధించారు.హెచ్‌సీఏ ఉన్నత కమిటీకి సమర్ధంగా ఎన్నికలు జరిపేందుకు 2023 ఫిబ్రవరి 14న జస్టిస్‌ నాగేశ్వరరావు కమిటీని సుప్రీం నియమించింది. ఈ క్రమంలోనే గతంలో సుప్రీం నియమించిన పర్యవేక్షక కమిటీ నివేదికను సైతం జస్టిస్ నాగేశ్వరరావు పరిగణించారు. సుమారు 80 క్లబ్‌లను అధీనంలో ఉంచుకున్న 12 మంది పెద్దలు, వారి కుటుంబీకులు HCA ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని పర్యవేక్షక కమిటీ నిర్థారించింది.

DETAILS

21 క్లబ్‌లు చేతులు మారి ప్రైవేట్ వ్యక్తులకు చేరినట్లు గుర్తించిన కమిటీ

జీహెచ్‌ఎంసీ(GHMC)కి చెందిన సుమారు 21 క్లబ్‌లు చేతులు మారి ప్రైవేట్ వ్యక్తులకు చేరినట్లు కమిటీ గుర్తించింది. ఆయా క్లబ్‌ల అధ్యక్ష, కార్యదర్శుల నుంచి జస్టిస్ వివరణ రాబట్టారు. కొందరు బహుళ క్లబ్‌లు కలిగి ఉన్నారని తేల్చిన జస్టిస్‌ నాగేశ్వరరావు కఠిన చర్యలకు ఉపక్రమిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో ఈ క్లబ్‌లు పాల్గొనకుండా, ఓటు హక్కు వినియోగించుకోకుండా నిషేధాజ్ఞలు జారీ చేశారు. శేష్‌ నారాయణ, పురుషోత్తం అగర్వాల్‌, సురేందర్‌ అగర్వాల్‌, ప్రకాష్‌ చంద్‌ జైన్‌, అర్షద్‌ అయూబ్‌, వంకా ప్రతాప్‌, విక్రమ్‌ మాన్‌సింగ్‌, స్వరూప్‌, విజయానంద్‌, జాన్‌ మనోజ్‌, HCA అధ్యక్ష, కార్యదర్శి సహా ఉన్నత పదవులపై ఆశలు పెట్టుకున్న వారు ఎన్నికల రేసు నుంచి బహిష్కరింపబడ్డారు.