తదుపరి వార్తా కథనం
French train: పారిస్ ఒలింపిక్స్ వేడుక ప్రారంభానికి ముందు ఫ్రాన్స్ రైలు మార్గాలపై దాడులు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 26, 2024
01:23 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒలింపిక్ వేడుక ప్రారంభానికి ముందు, హైస్పీడ్ రైలు మార్గాలపై దాడులు జరిగినట్లు రైలు ఆపరేటర్ SNCF శుక్రవారం తెలిపింది.
BBC ప్రకారం, గురువారం రాత్రి కొన్ని మార్గాల్లో దుండగులు విధ్వంసం, దహనం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే విచారణ మొదలైంది.
ఈసారి ఒలింపిక్స్ 2024 పారిస్‌లో నిర్వహిస్తున్నారు. పారిస్ కి ప్రపంచం నలుమూలల నుండి ఇప్పటికే ఆటగాళ్ళు వచ్చారు. ఇక్కడ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
రవాణా మంత్రి పాట్రిస్ వెర్గ్రిట్ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.
ఇప్పటికే చాలా రైళ్లు రద్దు అయ్యాయి. "ఈ వారాంతం వరకు మరమ్మత్తు పని కొనసాగుతుందని" అని SNCF తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పారిస్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు దాడి
Vandals target Paris Olympics with arson attacks on high-speed rail routeshttps://t.co/Mck3KHwDNF
— Rob Harris (@RobHarris) July 26, 2024