Page Loader
Radhika Yadav Murder: టెన్నిస్ కోర్ట్ నుంచి ట్రాజెడీ వరకు.. రాధికా యాదవ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి! 
టెన్నిస్ కోర్ట్ నుంచి ట్రాజెడీ వరకు.. రాధికా యాదవ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి!

Radhika Yadav Murder: టెన్నిస్ కోర్ట్ నుంచి ట్రాజెడీ వరకు.. రాధికా యాదవ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 12, 2025
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గురుగ్రామ్‌లో జరిగిన ఈ విషాదకర ఘటనలో తన తండ్రి దీపక్ యాదవ్ చేతిలోనే రాధికా ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అయితే తాజా దర్యాప్తులో ఈ హత్యకు కారణంగా ఆర్థిక సమస్యలు, కుటుంబ అంతర్గత వివాదాలు, ముఖ్యంగా టెన్నిస్ అకాడమీ నిర్వహణలో తలెత్తిన అభిప్రాయభేదాలే దారితీశాయని పోలీసులు వెల్లడించారు.

Details

టెన్నిస్ అకాడమీపై వివాదమే ముప్పు

రాధికా టెన్నిస్ కెరీర్‌ను గాయాల కారణంగా కొనసాగించలేకపోయినా, తన ప్రయాణాన్ని ఆపకుండా ఒక టెన్నిస్ అకాడమీ స్థాపించి నిర్వహించసాగింది. ఇదే సమయంలో ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కూడా ఎదగాలనుకున్నారు. ఒక మ్యూజిక్ వీడియోలోనూ నటించారు. ఈ అభిరుచులకు తండ్రి దీపక్ వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన టెన్నిస్ శిక్షణ కోసం అప్పటివరకు సుమారు రూ. 2 కోట్ల మేర ఖర్చు చేసినట్లు సమాచారం. కానీ గ్రామస్తులు తనపై వేసే ఆరోపణలు, కుమార్తెపై నియంత్రణ కోల్పోయినట్లు వినిపించే వ్యాఖ్యలు దీపక్ తట్టుకోలేకపోయాడు

Details

తీవ్ర మనోవేదనలో దీపక్.. ఆత్మహత్య యత్నం కూడా!

దీపక్ యాదవ్ తాను వజీరాబాద్ నుంచి తిరిగొచ్చిన తర్వాత గ్రామస్థుల వేధింపులు, కుమార్తెపై ఉన్న ఆధారపడే ఆరోపణలతో తీవ్ర మానసిక ఒత్తిడిలోనికి వెళ్లారు. కొంతకాలం పాటు ఆత్మహత్య ఆలోచనలు కూడా చేశారు. ఒక దశలో ఆ ప్రయత్నం కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. కానీ కుటుంబాన్ని విడిచి వెళ్లలేనన్న భావనతో ఆ ఆలోచన నుంచి వెనక్కి వెళ్లారు.

Details

గొడవలు.. చివరికి దారుణం

ఆ తర్వాత కుమార్తె రాధికా అకాడమీ మూసివేయాలని, సోషల్ మీడియా, ఇతర రంగాలపై దృష్టి పెట్టకుండా టెన్నిస్‌నే పూర్తిగా వదిలేయాలని పదే పదే కోరుతూనే ఉన్నారు. ఈ అంశంపైనే ఘటన జరిగే రోజున వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రాధికా తన అభిప్రాయానికే కట్టుబడి ఉండగా, కోపోద్రిక్తుడైన దీపక్ ఆమె వంట చేస్తుండగా ఆమె ఛాతీలో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ సమయంలో రాధిక తల్లి మంజు యాదవ్ ఇంట్లోనే ఉండటంతో మళ్లీ విచారకరంగా మారింది. అయితే ఘటన జరిగిన సమయంలో ఆమె నిద్రలో ఉండటంతో ఏమీ గమనించలేకపోయినట్లు పేర్కొన్నారు. హత్యకు గల కారణాల గురించి తనకు తెలియదని తెలిపారు.

Details

కేసు విచారణ ముమ్మరం

ప్రస్తుతం పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. టెన్నిస్ అకాడమీ, కుటుంబ మధ్య సంభాషణలు, ఆర్థిక లావాదేవీలతో పాటు అప్పటి పరిస్థితులపై ఆధారపడుతూ దర్యాప్తు చేస్తున్నారు. రాధికా మృతి వెనుక నిగూఢ కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.