వేలంలో అధిక ధరకు అమ్ముడుపోయిన అటగాళ్లు వీరే..
IPL 2023 వేలంలో అస్ట్రేలియా హిట్టర్ కామెరూన్ గ్రిన్ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. అతన్ని ముంబై ఇండియన్స్ ఏకంగా రూ. 17.50 కోట్లకు కొనుగోలు చేసింది. గ్రీన్ కోసం ముంబై, ఢిల్లీ పోటి పడగా.. చివరికి MI దక్కించుకుంది. అదే విధంగా ఇంగ్లాడ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్రోక్స్ కూడా అధిక ధర పలికాడు. అతడిని చైన్నై సూపర్ కింగ్స్ రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. చివరిసారిగా స్ట్రోక్స్ రాజస్థాన్ తరుపున అడాడు. ఈసారి స్ట్రోక్స్ ను ఆ జట్టు రిటైన్ చేసుకోవడంతో వేలంలోకి వచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి సెట్‌లోనే ఇద్దరు బ్యాటర్లను కొనుగోలు చేసింది. హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్లకు, మయాంక్‌ను రూ.8.25 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది.
బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్‌పై ఆసక్తి చూపని ప్రాంఛైజీలు
జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజాను రూ.50 లక్షలకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది.బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్‌పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు. అతని బేస్‌ప్రైస్ రూ.1.5 కోట్లు. ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్‌పై ఫ్రాంఛైజీలు ఎవరూ ఆసక్తి చూపలేదు. రూ.కోటి బేస్ ప్రైస్‌తో ఉన్న అతని కోసం ఏ ఫ్రాంఛైజీ బిడ్ దాఖలు చేయలేదు. మినీ వేలంలో తొలి ప్లేయర్‌గా కేన్ విలియమ్సన్ వచ్చాడు. దీంతో అతని బేస్ ప్రైస్ రూ.2 కోట్లుగా ఉంది. అతడిని గుజరాత్ టైటన్స్ బేస్‌ప్రైస్ దగ్గరే కొనుగోలు చేయడం విశేషం.