Page Loader
INDIA: గబ్బా టెస్టు డ్రా.. మరి భారత్ WTC ఫైనల్‌కు చేరడానికి అర్హతలివే!
గబ్బా టెస్టు డ్రా.. మరి భారత్ WTC ఫైనల్‌కు చేరడానికి అర్హతలివే!

INDIA: గబ్బా టెస్టు డ్రా.. మరి భారత్ WTC ఫైనల్‌కు చేరడానికి అర్హతలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 18, 2024
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ ఫలితంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్, ఆస్ట్రేలియా అవకాశాలు ఎలా ఉంటాయనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (58.89%) రెండో స్థానంలో, భారత్ (55.88%) మూడో స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా (63.33%) అగ్రస్థానంలో ఉంది. గబ్బా టెస్టులో ఫాలో ఆన్‌లో పడినప్పటికీ, బుమ్రా, ఆకాశ్‌దీప్‌ మంచి ప్రదర్శనతో భారత్‌ను ఫాలో ఆన్‌ గండం నుంచి బయటపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితం భారత్‌కు ఇబ్బందులను సృష్టించొచ్చు.

Details

మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే ఛాన్స్

భారత్ ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టుల్లో గెలిస్తే, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవచ్చు. ఒకవేళ టీమిండియా, ఆస్ట్రేలియాతో 2-1తో సిరీస్‌ గెలిచితే, అప్పుడు శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య రెండు టెస్టుల సిరీస్‌ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. శ్రీలంక ఆస్ట్రేలియాను 1-0 లేదా 1-1తో ఓడించగలిగితే, భారత్‌కు ఫైనల్‌ అవకాశాలు మెరుగుపడతాయి. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ 2-2తో సమం అయినా, శ్రీలంక ఆస్ట్రేలియాతో 2-0తో సిరీస్‌ గెలిచినా, భారత్‌కు అవకాశాలు ఉండవచ్చు. భారత్-ఆస్ట్రేలియా సిరీస్ 2-2తో సమం అయి, ఆస్ట్రేలియా శ్రీలంకపై 2-0తో సిరీస్ గెలిచినా, భారత్‌కు ఫైనల్‌ చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే, పాకిస్థాన్‌ దక్షిణాఫ్రికాపై 2-0తో సిరీస్‌ గెలవడం అత్యంత అవసరం.