
Gary Kirsten: పాక్‌కు గుడ్‌బై చెప్పిన గ్యారీ కిరిస్టెన్..కొత్త కోచ్ కోసం పీసీబీ పావులు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌కు 2011 వరల్డ్ కప్ అందించిన సక్సెస్‌ఫుల్ కోచ్ గ్యారీ కిరిస్టెన్.. అయితే పాకిస్థాన్ జట్టుకు పరిమిత ఓవర్ల కోచ్‌గా నియమించినా నుంచి ఆ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
కేవలం నాలుగు నెలల క్రితం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆశతో తీసుకొచ్చిన కోచ్ గ్యారీ కిరిస్టెన్ తన పదవికి రాజీనామా చేశారు.
ఎన్ని మార్పులుచేసినా, ఆటగాళ్లతో ఏర్పడిన విభేదాలు ఆయనకు ఆ జట్టులో కొనసాగేందుకు అడ్డంకిగా మారాయి.
పాకిస్థాన్ జట్టులోని సీనియర్ ఆటగాళ్లు, కోచ్ గ్యారీ కిరిస్టెన్ మధ్య శాంతి నిలవకపోవడం ఆయనకు ప్రధాన సవాల్‌గా మారింది. బసిత్ అలీ వంటి మాజీ క్రికెటర్లు కూడా ఇది ముందే ఊహించారు.
Details
జాసన్ గిలెస్పీకి బాధ్యతలు
పీసీబీ ఇటీవల ఆసీస్, జింబాబ్వేతో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం మహమ్మద్ రిజ్వాన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం, కోచ్ గ్యారీ కిరిస్టెన్‌కు అంగీకరించలేని నిర్ణయంగా మారింది.
ఆటగాళ్లతో గ్యారీకి విభేదాలు ఏర్పడినా, పీసీబీ పూర్తి మద్దతును ఇవ్వలేకపోవడం వల్ల కిరిస్టెన్ వ్యూహాలకు అడ్డంకి ఏర్పడింది.
కోచ్‌గా ఉన్న కిరిస్టెన్ రాజీనామా చేయడంతో, టెస్టులకు తాత్కాలిక కోచ్‌గా ఉన్న జాసన్ గిలెస్పీకి పరిమిత ఓవర్ల బాధ్యతలు కూడా అప్పగించారు.
పీసీబీ వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ఆకిబ్ జావేద్‌ను లేదా గిలెస్పీని కోచ్‌గా నియమించనున్నట్లు వార్తలు ఉన్నాయి.