
Gambhir-Shah Rukh : వరుసగా మూడు మ్యాచుల్లో డకౌట్.. అయినా ఆడాలని ప్రామిస్ చేయించుకన్నాడు : గంభీర్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్(IPL)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఆ జట్టు మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ రెండుసార్లు విజేతగా నిలిపాడు.
అయితే 2014లో కేకేఆర్ జట్టు తరుఫున గౌతమ్ గంభీర్(Gautam Gambhir) మొదట్లో అనుకున్నంత స్థాయిలో రాణించలేదు.
దీంతో గంభీర్ రిజర్వ్ బెంచ్ కే పరిమతం కావాలని భావించాడు.
ఇదే అంశంపై కేకేఆర్ ఫ్రాంచైజీ యజమాని షారుక్ ఖాన్(Shahrukh Khan) కూడా చర్చించినట్లు తెలిసింది.
తాజాగా గంభీర్ ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
2014లో పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న సమయంలో షారుక్ ఖాన్ తనకు మద్దతుగా నిలిచాడని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ఆ ఎడిషన్లో గంభీర్ వరుసగా మూడు మ్యాచుల్లో డకౌట్ అయ్యాడు. నాలుగో మ్యాచులో కూడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశారు.
Details
2014 ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర
తర్వాతి మ్యాచుకు సిద్ధమవుతున్న తరుణంలో షారుక్ ఖాన్ జట్టు పరిస్థితి గురించి గంభీర్‌ను అడిగాడు.
అప్పుడు తాను జట్టు వైదొలుగుదామనుకుంటున్నానని షారుక్‌తో చెప్పగా, దానికి అతను అంగీకరించలేదని గంభీర్ పేర్కొన్నారు.
తనకు నచ్చినంత కాలం జట్టులో కొనసాగాలని, అయితే ప్రతి మ్యాచులోనూ ఆడేలా తన వద్ద ప్రామిస్ కూడా చేయించుకున్నాడని గంభీర్ వెల్లడించారు.
ఆ తర్వాతి మ్యాచులో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి, కేకేఆర్ జట్టును రెండోసారి ఐపీఎల్ విజేతగా నిలబెట్టానని వ్యాఖ్యానించాడు.
లీగ్ స్టేజ్‌లో మొదటిఏడు మ్యాచుల్లో ఐదు మ్యాచులు ఓడిన కేకేఆర్.. ఆ తర్వాత వరుసగా విజయాలు సాధించి టైటిల్‌ను అందుకుంది.ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను మూడు వికెట్ల తేడాతో కేకేఆర్ ఓడించింది.