
IND Vs NZ : నేడు న్యూజిలాండ్‌తో సెమీస్.. 260 పరుగులు చేస్తే చాలన్న గావాస్కర్
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్, టీమిండియా జట్లు తలపడనున్నాయి.
తొలి సెమీ ఫైనల్ మ్యాచుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మ్యాచ్ కావడంతో టాస్ గెలిచిన జట్టు ఏం ఎంచుకుంటున్నది అనేది కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం భారత్-కివీస్ పోరులో టాస్ అంత ముఖ్యం కాదని పేర్కొన్నారు.
భారత్ బౌలర్లు ఫామ్ చూస్తే టాస్ ఓడి ఫీల్డింగ్ చేయాల్సి వచ్చినా చెలరేగుతారని ఆయన ఓ అంచనాకు వచ్చాడు.
ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేస్తే భారత్ 300 పరుగులకు పైగా చేస్తే కానీ మ్యాచ్ గెలవడం కష్టమన్న అంచనాలను కూడా గవాస్కర్ కొట్టిపారేశాడు.
Details
టాస్ కీలకం కాదన్న గవాస్కర్
మొదట బ్యాటింగ్‌లో భారత్ 260 నుంచి 270 పరుగులు చేస్తే చాలని, భారీ పరుగులు చేయాల్సిన అవసరం లేదన్నారు.
అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం వల్ల ఓ అడ్వాంటేజ్ ఉంటుందని, భారీ స్కోరు చేస్తే ఆ మేరకు బౌలర్లు ఛేజింగ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా వికెట్లు తీసేందుకు వీలు ఉంటుందని చెప్పాడు.
రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ తమ హోం గ్రౌండ్‌లో ఆడుతున్నారని, ఇది కలిసొచ్చే అంశమని పేర్కొన్నాడు.
ఇక ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఫామ్ లో ఉండటం వంటి కారణాలతో భారత్ ఈ మ్యాచులో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోందన్నారు.