
IPL 2024: ఐపీఎల్ 2024లో ఫాస్టెస్ట్ బాల్ ఇదే..!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2024లో సోమవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీ ఓ రికార్డును నమోదు చేశారు.
157.4 కీ.మీ వేగంతో బంతిని వేశారు. కాగా, ఈ సీజన్ లో ఇదే అత్యంత వేగవంతమైన డెలివరీగా రికార్డులకెక్కింది .
ఇక రెండు రోజుల క్రితం లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ 155.8 కీ.మీ వేగంతో బౌలింగ్ వేసిన విషయం తెలిసిందే.
ఇక ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ (157.71కీ.మీ)బాల్ వేసిన రికార్డు ఆస్ట్రేలియా పేసర్ షాన్ టైట్ పేరిట ఉంది.
కోయెట్జీ IPL 2024లో అగ్రస్థానంలో ఉండటమే కాకుండా,షాన్ టైట్ 13 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టి ఆల్-టైమ్ IPL జాబితాలోకి ప్రవేశించాడు.
Details
IPL 2024లో అత్యంత వేగవంతమైన డెలివరీల పూర్తి జాబితా
157.4 kmph - గెరాల్డ్ కోయెట్జీ - MI vs RR
155.8 kmph - మయాంక్ యాదవ్ - LSG vs PBKS
153.9 kmph - మయాంక్ యాదవ్ - LSG vs PBKS
153.4 kmph - మయాంక్ యాదవ్ - LSG vs PBKS
153 kmph - నాంద్రే బర్గర్ - RR vs DC
152.3 kmph - గెరాల్డ్ కోయెట్జీ - MI vs SRH
151.2 kmph - అల్జారీ జోసెఫ్ - RCB vs KKR
150.9 kmph - మతీష పతిరన - CSK vs GT
Details
IPL చరిత్రలో అత్యంత వేగవంతమైన డెలివరీలు:
షాన్ టైట్ 157.71 mph
గెరాల్డ్ కోయెట్జీ 157.4 mph
లాకీ ఫెర్గూసన్ 157.3 mph
ఉమ్రాన్ మాలిక్ 157 kmph
ఎన్రిచ్ నోర్ట్జే 156.22 kmph
ఉమ్రాన్ మాలిక్ 156 kmph
మయాంక్ యాదవ్ 155.8 kmph
గత డిసెంబర్‌లో కోయెట్జీని ముంబై మినీ-వేలంలో తీసుకుంది. అక్కడ అతను 50 ఓవర్ల ఈవెంట్‌లో ఒకే ఎడిషన్‌లో 20 వికెట్లు తీసిన మొట్టమొదటి దక్షిణాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు.
దీనికి ముందు గతేడాది SA20లో బ్రేక్‌అవుట్ సీజన్‌లో అతను 23 వికెట్లు తీశాడు.
అయితే, ఈ రైట్-ఆర్మర్ ముంబై తరపున 11.43 ఎకానమీ రేటుతో మూడు మ్యాచ్‌లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే సాధించగలిగాడు.