
IND vs WI: విండీస్‌పై గిల్ అద్భుత సెంచరీ… భారత్ తొలి ఇన్నింగ్స్ 518/5 డిక్లేర్
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన చేశారు. 196 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 129* పరుగులు సాధించి సెంచరీ బాదారు. గిల్ కెరీర్‌లో ఇది 10వ టెస్టు సెంచరీగా నిలిచింది. అతడి తో పాటు యశస్వీ జైస్వాల్ (175), సాయిసుదర్శన్ (87), కేఎల్ రాహుల్ (38), నితీశ్‌కుమార్‌రెడ్డి (43) రాణించడంతో, భారత్ రెండో రోజు రెండో సెషన్‌లోనే తొలి ఇన్నింగ్స్‌ను 518/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ నుంచి వారికన్ 3, రోస్టన్ ఛేజ్ 1 వికెట్ తీసారు. మొదట కొంచెం ఆచితూచి ఆడిన గిల్ క్రీజ్‌లో స్థిరపడిన తర్వాత వేగాన్ని పెంచారు.
Details
ఐదో వికెట్ కు శతక భాగస్వామ్యం
ధ్రువ్ జురెల్ (44) కూడా దూకుడుగా ఆడుతూ ఐదో వికెట్‌కు శతక భాగస్వామ్యం నిర్మించారు. జురెల్ ఆరు పరుగుల దూరంలో ఔట్ అయ్యిన వెంటనే గిల్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు. గిల్ ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన సారథిగా విరాట్ కోహ్లీతో సమంగా నిలిచారు. కోహ్లీ 2017, 2018 వరుస సంవత్సరాల్లో ఐదు శతకాలు సాధించిన సారథి. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్ ఐదో సెంచరీ సాధించడం గమనార్హం.