Shubman Gill: రోహిత్‌పై విమర్శలకు గిల్ కౌంటర్.. 'ప్రతిసారీ పెద్ద స్కోర్లు సాధ్యం కాదు'
ఈ వార్తాకథనం ఏంటి
ఇందౌర్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 41 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. లభించిన ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. వడోదరలో జరిగిన తొలి వన్డేలో 26 పరుగులు చేసిన రోహిత్, రాజ్‌కోట్ రెండో వన్డేలో 24 పరుగులకే ఔటయ్యాడు. ఇందౌర్ మూడో వన్డేలో 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మొత్తం మూడు ఇన్నింగ్స్‌లలో కలిపి 61 పరుగులే చేయడంతో అతడి సగటు 20.33గా నమోదైంది.
Details
ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్లు చేయడం సాధ్యం కాదు
ఈ ప్రదర్శనపై మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో విలేకరులు ప్రశ్నించగా, టీమ్‌ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు. రోహిత్ శర్మకు పూర్తి మద్దతుగా నిలిచిన గిల్... 'రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో అతడు మంచి పరుగులు సాధించాడు. అయితే ప్రతి మ్యాచ్‌లో భారీ స్కోర్లు చేయడం సాధ్యం కాదు. ప్రతి ఇన్నింగ్స్‌లో సెంచరీ కొట్టాలని ఆశించడం వాస్తవికం కాదంటూ వ్యాఖ్యానించాడు. మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.
Details
296 పరుగులకే అలౌట్
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 108 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లతో 124 పరుగుల సెంచరీ సాధించాడు. అలాగే నితీశ్‌కుమార్ రెడ్డి 53 పరుగులు, హర్షిత్ రాణా 52 పరుగులతో అర్ధశతకాలు నమోదు చేశారు. అయినప్పటికీ, ఆ ప్రదర్శనలు టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించలేకపోయాయి.