LOADING...
Shubman Gill: ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన గిల్‌.. అత్యధిక పరుగులతో రికార్డు!
ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన గిల్‌.. అత్యధిక పరుగులతో రికార్డు!

Shubman Gill: ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన గిల్‌.. అత్యధిక పరుగులతో రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2025
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో 700కు పైగా పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా చరిత్రలో నిలిచాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గిల్ 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఓ టెస్టు సిరీస్‌లో 700కు పైగా పరుగులు చేసిన మూడవ భారత బ్యాటర్‌గా కూడా గిల్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్లు జాబితాలో గిల్ తొలి స్థానంలో నిలిచాడు:

Details

ఇంగ్లాండ్‌లో ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్లు

శుభ్‌మన్ గిల్ (భారత్) - 701 పరుగులు మహ్మద్ యూసఫ్ (పాకిస్తాన్) - 631 పరుగులు రాహుల్ ద్రావిడ్ (భారత్) - 602 పరుగులు విరాట్ కోహ్లీ (భారత్) - 593 పరుగులు అలాగే, ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో కూడా గిల్ మూడవ స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో 1970-71 సీజన్‌లో వెస్టిండీస్‌పై 774 పరుగులతో సునీల్ గవాస్కర్ ఉన్నాడు. ఆ తర్వాత 2024లో ఇంగ్లాండ్‌పై 712 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్ ఉన్నాడు. గిల్ ప్రస్తుతం నాలుగు టెస్టుల్లో 700\* పరుగులతో మూడవ స్థానానికి చేరుకున్నాడు.

Details

ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లు

సునీల్ గవాస్కర్ - 774 పరుగులు (1970/71, వెస్టిండీస్‌పై, 4 టెస్టులు) సునీల్ గవాస్కర్ - 732 పరుగులు (1978/79, వెస్టిండీస్‌పై, 6 టెస్టులు) యశస్వి జైస్వాల్ - 712 పరుగులు (2024, ఇంగ్లాండ్‌పై, 5 టెస్టులు) శుభ్‌మన్ గిల్ - *700 పరుగులు* (2025, ఇంగ్లాండ్‌పై, 4 టెస్టులు)