Page Loader
ENG vs IND : గెలుపుపై గిల్ అసంతృప్తి.. లార్డ్స్ టెస్టులో జట్టులో మార్పులు ఖాయం!
గెలుపుపై గిల్ అసంతృప్తి.. లార్డ్స్ టెస్టులో జట్టులో మార్పులు ఖాయం!

ENG vs IND : గెలుపుపై గిల్ అసంతృప్తి.. లార్డ్స్ టెస్టులో జట్టులో మార్పులు ఖాయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 07, 2025
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి, 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సిరీస్‌ను 1-1తో సమం చేసిన టీమిండియా, మూడో టెస్టులో ఆధిక్యంలోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. ఒవర్‌నైట్ స్కోరు 72/3తో ఐదవ రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్‌ 271 పరుగులకే ఆలౌటైంది. జేమీ స్మిత్(88)టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలింగ్‌ను ఎదుర్కొనలేక ఇంగ్లాండ్ తడబడగా, ఆకాశ్ దీప్ 6 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. ఇంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసి ఆధిక్యంలోకి వెళ్లగా, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 407పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 427/6 వద్ద డిక్లేర్ చేసింది.

Details

టెస్టు కెప్టెన్ గా తొలి గెలుపు

ఈ విజయం టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు తొలి గెలుపు. అంతేకాదు ఎడ్జ్‌బాస్టన్‌లో టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ, తొలి టెస్టులో ఓటమి అనంతరం బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో చేసిన తిరుగుబాటే గెలుపుకు కారణమని వ్యాఖ్యానించాడు. ఇక, సిరీస్ ఫలితంపై ప్రభావం చూపే మూడో టెస్టు జూలై 10 నుంచి 14 వరకు లార్డ్స్‌ వేదికగా జరగనుంది. గెలిచిన జట్టుతో మూడో టెస్టులో కొనసాగమని చెప్పలేమని తుది జట్టులో మార్పులు ఉండబోతున్నాయని గిల్ ప్రకటించాడు.

Details

తుది జట్టుపై అభిమానుల్లో ఉత్కంఠ

వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రెండో టెస్టులో బుమ్రాకు విశ్రాంతినిచ్చిన భారత్, మూడో టెస్టులో అతడిని తుది జట్టులో తీసుకుంటుందని గిల్ వెల్లడించాడు. తనకు లార్డ్స్‌లో ఆడే అవకాశం రావడం గర్వంగా ఉందని ఇది ప్రతీ క్రికెటర్ కలల మైదానం అని అన్నాడు. రెండో టెస్టులో బుమ్రా స్థానంలో ఆడిన ఆకాశ్ దీప్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బుమ్రా తిరిగి రావడం వల్ల ఆకాశ్ దీప్‌ను మళ్లీ తుది జట్టులో కొనసాగిస్తారా, లేదా సిరాజ్, ప్రసిద్ద్‌లలో ఎవరి స్థానాన్ని తీస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్ విజయంతో ఉత్సాహంలో ఉండగా, మూడో టెస్టు కోసం ఎలాంటి తుది జట్టు ఉండబోతోందన్న అంశం అభిమానుల్లో ఉత్కంఠను రేపుతోంది.