
Shubman Gill: అనారోగ్యంతో బాధపడుతున్న గిల్.. దులిప్ ట్రోఫీకి దూరం
ఈ వార్తాకథనం ఏంటి
దులీప్ ట్రోఫీకి కౌంట్‌డౌన్ మొదలైంది. ఐదు రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, దాని తర్వాత పది రోజులకే ఆసియా కప్ మొదలవుతుంది. ఇటీవలే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో రాణించిన శుభమన్ గిల్, టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కానీ, అభిమానులకు నిరాశ కలిగించే వార్త బయటకు వచ్చింది. గిల్ దులీప్ ట్రోఫీకి దూరమవుతున్నాడు. అంతేకాదు, ఆసియా కప్‌లో కూడా అతని పాల్గొనడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గిల్ వైరల్ ఫీవర్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇప్పటికే రక్త నమూనాలను బ్లడ్ టెస్టుకు పంపగా, ఆ రిపోర్ట్ బీసీసీఐకి చేరిందని తెలుస్తోంది. ఫలితంగా గిల్‌కు దులీప్ ట్రోఫీ నుంచి మినహాయింపు లభించింది.
Details
సారథ్య బాధ్యతలను చేపట్టనున్న అంకిత్ కుమార్
అసలు నార్త్ జోన్ జట్టుకు అతడే సారథిగా ఎంపికైనప్పటికీ, ఇప్పుడు అతడి స్థానంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న అంకిత్ కుమార్ జట్టును నడిపే అవకాశం ఉంది. భారత జట్టు ఇప్పటికే ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమ్ ఇండియా బరిలోకి దిగనుంది. గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ టోర్నీ కోసం భారత్ సెప్టెంబర్ ఆరంభంలోనే యూఏఈకి బయలుదేరుతుంది. సెప్టెంబర్ 5న తొలి ట్రైనింగ్ సెషన్ జరగనుంది. అప్పటివరకూ గిల్ పూర్తిగా కోలుకుంటే, ఎలాంటి సమస్య లేకుండా దుబాయ్ చేరుతాడు. ఎలాగూ దులీప్ ట్రోఫీలో అతడు ఆడటం లేదు. భారత్ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. కాబట్టి ఆసియా కప్ నుంచి గిల్ వైదొలగడం దాదాపు అసాధ్యమే.