Page Loader
దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ దూరం 
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు గ్లెన్ మాక్స్‌వెల్ దూరం

దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ దూరం 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2023
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ద‌క్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా టీంకి పెద్ద దెబ్బ త‌గిలింది.ఇప్పటికే స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ గాయాలతో సతమతమౌతుంటే ఇప్పుడు స్టార్ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా గాయ‌ప‌డ్డాడు. మ్యాక్స్‌వెల్ ఎడ‌మ కాలి చీల‌మండ‌కు గాయం అయ్యింది. 2021లో ఎడ‌మ కాలికి దెబ్బ త‌గ‌ల‌డంతో మెట‌ల్ ప్లేట్స్ అమ‌ర్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే చోట గాయం కావ‌డంతో అత‌ను సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. ప్రపంచ క‌ప్ ముందు టీమిండియాతో జ‌రిగే వ‌న్డే సిరీస్ క‌ల్లా మ్యాక్స్‌వెల్ కోలుకుంటాడ‌ని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.

Details 

టీ20 సిరీస్‌కు కెప్టెన్ గా ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్

గాయం తీవ్ర‌త‌మ్యాక్స్‌వెల్ కోలుకునే తీరును ద‌గ్గ‌రుండి పరిశీలిస్తామని సెలెక్ట‌ర్ టోనీ డొడెమెడ్ అన్నారు. అత‌ను టీమిండియాతో వ‌న్డే సిరీస్‌లో బ‌రిలోకి దిగుతాడ‌నే న‌మ్మ‌కం తమకు ఉందని ఆయన ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించాడు. దక్షిణాఫ్రికా జ‌ట్టుతో వ‌న్డే సిరీస్‌కు ఎంపిక‌వ్వ‌ని మ్యాక్స్‌వెల్ స్వదేశం బ‌య‌లుదేర‌నున్నాడు. మ్యాక్స్‌వెల్ స్టానంలో వికెట్ కీప‌ర్ మాథ్యూ వేడ్ జట్టులోకి వ‌చ్చాడు. సఫారీ టీ20 సిరీస్‌కి ఆల్‌రౌండ‌ర్ మిచెల్ మార్ష్ సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. ఆగ‌స్టు 30వ తేదీన మొద‌టి టీ20 మొదలుకానుంది.