Asian Games 2023 : శబాష్ జ్యోతి, ఓజాస్.. ఆర్చరీలో భారత్‌కు గోల్డ్ మెడల్
చైనా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత అథ్లెట్లు తమ సత్తా చాటుతున్నారు. తాజాగా భారతీయ ఆర్చరీ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఆర్చరీ మిక్స్‌డ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖా వెన్నం, ఓజాస్ దియోతలే జోడీ బంగారు పతకం కైవసం చేసుకున్నారు. మిక్స్‌డ్ ఆర్చరీ ఈవెంట్‌లో ఫెవరేట్‌గా ఉన్న దక్షిణకొరియా ఆటగాళ్లను చిత్తు చేశారు. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో కొరియాకు చెందిన సో చేవాన్, జూ జేహూన్ జంటను భారత జట్టు జోడి 159-150 తేడాతో ఓడించింది.
అగ్రస్థానంలో చైనా
ఓవరాల్‌గా ఈ ఆసియా క్రీడల్లో భారత్ 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్య పతకాలను గెలుచుకుంది. దీంతో పతకాల సంఖ్య 71కి చేరుకుంది. ప్రస్తుతం చైనా 164 స్వర్ణాలు, 90 రజతాలు, 46 కాంస్య పతకాలు సాధించి అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలో జపాన్, దక్షిణ కొరియాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆర్చరీలో భారత్ గోల్డ్ మెడల్ సాధించడంపై కోచ్ సెర్గియో పగ్ని సంతోషం వ్యక్తం చేశారు.