Sanju Samson : పాకిస్థాన్‌తో గోల్డ్ మెడల్ మ్యాచ్.. సంజూ శాంసన్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు!
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. శనివారం జరగనున్న గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో టీమిండియా.. పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ కీలక పోరులో విజయం సాధించి మరోసారి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు భారత స్టార్ ఆటగాడు సంజు శాంసన్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.
వివరాలు
మరో 6 సిక్సర్లు బాదితే..
పాకిస్థాన్‌తో జరిగే ఫైనల్‌లో సంజూ శాంసన్ 6 సిక్సర్లు బాదితే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు.
తద్వారా ఈ ఘనత సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు.
భారత్ తరఫున ఇప్పటికే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీలు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్సర్ల మైలురాయిని అందుకున్నారు.
ఇప్పుడు సంజూ శాంసన్ కూడా ఈ జాబితాలో చేరేందుకు కేవలం ఆరు సిక్సర్ల దూరంలో ఉన్నాడు.
వివరాలు
200 సిక్సర్ల క్లబ్‌లో రోహిత్ ఒక్కడే..
టీమ్ఇండియా తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ శర్మ 159 మ్యాచ్‌ల్లో ఏకంగా 205 సిక్సర్లు కొట్టాడు.
భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్సర్ల క్లబ్‌లో ఉన్న ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మనే.
సంజూ శాంసన్ గణాంకాలు..
సంజూ శాంసన్ ఇప్పటివరకు 71 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 27 సగటుతో 1,565 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 94 సిక్సర్లు బాదాడు. పాకిస్థాన్‌తో జరిగే ఫైనల్‌లో మరో ఆరు సిక్సర్లు కొడితే 100 సిక్సర్ల మైలురాయిని అందుకుంటాడు.
వివరాలు
భారత్ తరఫున అత్యధిక టీ20 సిక్సర్లు వీరే..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆ తర్వాతి స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ ఉన్నారు.
రోహిత్ శర్మ - 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
సూర్యకుమార్ యాదవ్ - 113 మ్యాచ్‌ల్లో 179 సిక్సర్లు
అభిషేక్ శర్మ - 61 మ్యాచ్‌ల్లో 127 సిక్సర్లు
హార్దిక్ పాండ్యా - 138 మ్యాచ్‌ల్లో 126 సిక్సర్లు
విరాట్ కోహ్లీ - 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు
కేఎల్ రాహుల్ - 72 మ్యాచ్‌ల్లో 99 సిక్సర్లు
సంజూ శాంసన్ - 71 మ్యాచ్‌ల్లో 94 సిక్సర్లు