Page Loader
IPL 2025: ఆర్సీబీ ఫ్యాన్స్ కు శుభవార్త.. హేజిల్‌వుడ్ ఎంట్రీతో పంజాబ్‌కు షాక్
ఆర్సీబీ ఫ్యాన్స్ కు శుభవార్త.. హేజిల్‌వుడ్ ఎంట్రీతో పంజాబ్‌కు షాక్

IPL 2025: ఆర్సీబీ ఫ్యాన్స్ కు శుభవార్త.. హేజిల్‌వుడ్ ఎంట్రీతో పంజాబ్‌కు షాక్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 28, 2025
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

హై-వోల్టేజ్ మ్యాచ్ అయిన ఐపీఎల్ 2025 తొలి క్వాలిఫయర్‌కు ముందు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు శుభవార్త లభించింది. స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కీలక మ్యాచ్‌లో జట్టుకు అందుబాటులో ఉంటారని అధికారికంగా ధ్రువీకరించారు. ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్, మెంటర్ అయిన దినేష్ కార్తీక్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆర్సీబీ శిబిరంలో ఉత్సాహం నెలకొంది.

Details

హేజిల్‌వుడ్ ఆడనున్న మ్యాచ్ వివరాలు

మే 29న చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనున్న తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో విజేత నేరుగా ఫైనల్‌కు ప్రవేశిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు హేజిల్‌వుడ్ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ అందుబాటులోకి రావడం ఆర్సీబీ జట్టుకు గొప్ప బలంగా మారనుంది. తక్కువ మ్యాచ్‌లు - ఎక్కువ ప్రభావం హేజిల్‌వుడ్ ఈ సీజన్‌లో కేవలం 10 మ్యాచ్‌ల్లో పాల్గొన్నప్పటికీ, మొత్తం 18 వికెట్లను పడగొట్టి, ఆర్సీబీకి అత్యధిక వికెట్లు అందించిన బౌలర్‌గా నిలిచాడు. అతని ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్, ముఖ్యంగా పవర్ ప్లేలో అదుపు, డెత్ ఓవర్లలో దూకుడు, ప్రత్యర్థి బ్యాటర్లకు నిద్ర లేకుండా చేశాయి.

Details

ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన హేజిల్‌వుడ్ 

ఏప్రిల్ 27 తర్వాత హేజిల్‌వుడ్ ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనలేదు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా లీగ్ తాత్కాలికంగా నిలిపివేయబడినప్పుడు అతను స్వదేశం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడ, దక్షిణాఫ్రికాతో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందస్తుగా శిక్షణలో పాల్గొన్నాడు. బ్రిస్బేన్‌లో ఫిట్‌నెస్ సాధించిన అనంతరం ఇండియాకు తిరిగి వచ్చి, మళ్లీ ఆర్సీబీ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు.

Details

ఆర్సీబీకి ప్లస్ పాయింట్ 

పెద్ద మ్యాచ్‌ల్లో హేజిల్‌వుడ్‌కు ఉన్న అనుభవం, ఒత్తిడిని సమర్థంగా నిర్వహించగల సామర్థ్యం ఆర్సీబీకి బలాన్ని ఇస్తుంది. క్వాలిఫయర్ వంటి నిర్ణాయక పోరులో అతని భాగస్వామ్యం ఆర్సీబీ విజయానికి కీలకం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.