IND vs AUS: టీమిండియాకు శుభవార్త.. అడిలైట్‌కు చేరుకున్న గౌతమ్ గంభీర్
టీమిండియా జట్టుకు శుభవార్త అందింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వచ్చినా, ఇప్పుడు ఆయన ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లి అడిలైడ్‌లో ఉన్న భారత జట్టుతో చేరాడు. డిసెంబర్ 6న ప్రారంభం కానున్న రెండో టెస్టుకు తుది జట్టును ఎంపిక చేసేందుకు గంభీర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. గంభీర్ పెర్త్ టెస్టు అనంతరం బీసీసీఐ అనుమతితో భారత్‌కు వచ్చి, అక్కడ కొన్ని రోజులు గడిపి తిరిగి ఆసీస్‌కు చేరుకున్నాడు. అడిలైడ్‌లో జరుగనున్న డే/నైట్ టెస్టుకు ముందుగా జట్టు సన్నాహకాలను పరిశీలించాడు.
డిసెంబర్ 6న రెండో టెస్టు
గంభీర్ గైర్హాజరీలో ప్రైమ్ మినిష్టర్స్ XI తో జరిగిన వార్మప్ మ్యాచ్‌కు అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ టీమ్ కోచింగ్ బాధ్యతలు నిర్వహించారు. . భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పాల్గొంటుంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6న రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ డే/నైట్ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ వంటి కీలక ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చారు. కానీ ఎవరు ఇన్నింగ్స్ ప్రారంభించాలి అన్న దానిపై కోచ్ గంభీర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది