Page Loader
వరల్డ్ కప్ టీమిండియా ఓటమి కారణంగా టీమ్ కోచ్ రాజీనామా
2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు చారిత్రాత్మక కాంస్య పతకాన్ని రీడ్ అందించాడు

వరల్డ్ కప్ టీమిండియా ఓటమి కారణంగా టీమ్ కోచ్ రాజీనామా

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 31, 2023
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత హాకీ జట్టు కోచ్ గ్రహం రీడ్ రాజీనామా చేశారు. ఇటీవల ఒడిశాలో జరిగిన హాకీ ప్రపంచ కప్ లో టీమిండియా వైఫల్యం కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రీడ్‌తో పాటు కోచ్ గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్ డేవిడ్ పెంబర్టన్ సైతం తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఈ టోర్నిలో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. గ్రాహం హయాంలో భారత్‌ ఎన్నో విజయాలు సాధించింది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌ (టోక్యో)లో కాంస్యం గెలవడమే కాక, కామన్వెల్త్‌ క్రీడల్లో రజతం సొంతం చేసుకుంది. ప్రపంచ అయిదో ర్యాంకులో ఉన్న భారత్‌.. సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్‌లో మాత్రం కనీసం క్వార్టర్‌ఫైనల్స్‌ చేరలేకపోవడం గమనార్హం.

హాకీ

భారత్ ఎన్నో విజయాలను సాధించాలి

తన బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని, భారత హాకీ జట్టుకి హెడ్ కోచ్ గా వ్యవహరించడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని రీడ్ తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ఎంతోమందికి రుణపడి ఉంటానని, భారత హాకీ మున్ముందు ఎన్నో గొప్ప విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నట్లు రీడ్ పేర్కొన్నారు. భారత్ చివరిసారిగా 1975లో టోర్నీని గెలుచుకుంది, 1973, 1971లో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచింది. 2018లో ఎడిషన్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లోనే టీమిండియా నిష్క్రమించింది. ఒడిశాలో జరిగిన ప్రపంచకప్‌లో బెల్జియంను ఓడించి.. జర్మనీ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది.