LOADING...
ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 05, 2023
08:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా మొదటి మ్యాచులో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 2019 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. న్యూజిలాండ్ ఓపెనర్ కాన్వే 152*, రచన్ రవీంద్ర 123* పరుగులు చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోరూట్ 77 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. లక్ష్య చేధనలో న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్ డకౌట్ కాగా, కాన్వే, రచన్ రెండో వికెట్ 273 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి 36.2 ఓవర్లలోనే టార్గెట్ ను చేధించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం